- గిరిధారి ప్రాస్పరా కౌంటీ
- కిస్మత్ పూర్.. ప్రశాంతమైన వాతావరణం
- పక్కనే ఈసా నది..
- మరోవైపు 6000 ఎకరాల గ్రీన్ రిజర్వ్
హైదరాబాద్ నగరంలోనే మరీ శివారు ప్రాంతాలకు కాకుండా సిటీకి దగ్గర్లో అదిరిపోయే హై ఎండ్ విల్లాలో ఉంటే బావుంటుందని భావిస్తున్నారా? అలాంటి విల్లా ప్రాజెక్టు ఏదైనా ఉందా అని చూస్తున్నారా? అయితే, మీ అన్వేషణకు ముగింపు పలకండి. మీరు కోరుకునే, చూడగానే కళ్లు చెదిరే.. అద్భుతమైన హై ఎండ్ విల్లా ప్రాజెక్టు ఒకటి రూపుదిద్దుకుంటోంది. గిరిధారి సంస్థ గిరిధారి ప్రాస్పరా కౌంటీ పేరుతో కిస్మత్ పూర్లో శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈసా నది పక్కనే నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుకు మరోవైపు ఆరు వేల ఎకరాల గ్రీన్ రిజర్వ్ ప్రాంతం ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టులో విల్లాల్ని కొనేందుకు కొందరు ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. అటు రివర్ వ్యూ, ఇటు నేషనల్ పార్కు.. చుట్టూ పచ్చదనం.. స్కూళ్లు, రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు అన్నింటికీ దగ్గర్లో ఈ ప్రాజెక్టు ఉండటం వల్ల ఏది కావాలన్నా ఎంతో దూరం వెళ్లాల్సిన పనే లేదు. వంద శాతం పవర్ బ్యాకప్ ఉండటం వల్ల విద్యుత్ సరఫరాకు ఆటంకమే ఉండదు.
ప్రాజెక్టు వివరాలివీ..
గిరిధారి ప్రాస్పరా కౌంటీలో మొత్తం 98 హై ఎండ్ విల్లాలను డెవలప్ చేస్తోంది. వీటి విస్తీర్ణం.. 4750 నుంచి 6150 చదరపు అడుగుల్లో ఉంటుంది. 4, 4.5 బీహెచ్ కే, ట్రిప్లె క్స్ విల్లాలను మీకు నచ్చిన విల్లాల్ని ఎంచుకునే వీలుంటుంది. 4 బీహెచ్ కే విల్లాలను చూస్తే 4750 చదరపు అడుగులు, 5180 చదరపు అడుగుల సైజుల్లో ఉన్నాయి. ఇక 4.5 బీహెచ్ కే విల్లా 6150 చదరపు అడుగుల్లో ఉంటుంది.
ప్రాజెక్టు సౌకర్యాలివీ..
గిరిధారి ప్రాస్పరా కౌంటీ సకల సౌకర్యాలతో, అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్ తో చూడచక్కని విల్లా డిజైన్లతో కళ్లు చెదిరే రీతిలో రూపుదిద్దుకుంటోంది. మెడికల్ సౌకర్యాలు, ఛేంజింగ్ రూమ్, మల్టీ పర్పస్ హాల్, లాన్ టెన్నిస్ కోర్టు, జాకుజీ, మెడికల్ స్టోర్, గ్రాసరీ షాప్, టేబుల్ టెన్నిస్, స్పా, సెలూన్, వీడియో డోర్ సెక్యూరిటీ, సోలార్ వాటర్ హీటింగ్, టెర్రస్ గార్డెన్, స్టీమ్ రూమ్, పార్టీ లాన్, సానా బాత్, బిలియర్డ్స్, స్నూకర్ టేబుల్, సీసీ టీవీ, పార్టీ హాల్, యాంఫీ థియేటర్, యోగా, మెడిటేషన్ ఏరియా, క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, మినీ థియేటర్, పైప్డ్ గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిఫికేషన్ (ట్రాన్స్ ఫార్మర్, సోలార్ ఎనర్జీ), ల్యాండ్ స్కేపింగ్, ట్రీ ప్లాంటింగ్, 24 గంటల నీటి సరఫరా, ఇంటర్ కమ్, క్లబ్ హౌస్, బాంకెట్ హాల్, మల్టీపర్పస్ రూమ్, ఫైర్ స్ప్రింక్లర్స్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, జిమ్నాజియం, స్విమింగ్ పూల్, ఏరోబిక్స్ రూమ్, స్క్వాష్ కోర్టు, టెన్నిస్ కోర్టు, పిల్లల ఆటస్థలం, స్టామ్ వాటర్ డ్రెయిన్లు, క్లోజ్డ్ కార్ పార్కింగ్, లిఫ్టులు, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, 24 గంటల సెక్యూరిటీ వంటి బోలెడు సౌకర్యాలు ఉన్నాయి.
అనుకూలమైన లొకేషన్..
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు లొకేషన్ పరంగా సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. స్థానిక మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్లు, ఫలక్ నుమా రైల్వే స్టేషన్ 8.4 కిలోమీటర్లు, ఉప్పుగూడ రైల్వే స్టేషన్ 9.2 కిలోమీటర్లు, నాంపల్లి రైల్వే స్టేషన్ 10.1 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 11.1 కిలోమీటర్లు, బేగంపేట విమానాశ్రయం 15.2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇంకా రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన అన్ని సౌకర్యాలూ దగ్గర్లోనే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రుణాలు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే గిరిధారి ప్రాస్పరా కౌంటీ సందర్శించి.. మీకు నచ్చిన విల్లాను ఎంచక్కా బుక్ చేసుకోండి.