చుట్టూ చక్కని గ్రీనరీ, ఆకట్టుకునే పెద్ద పెద్ద పూలు, పక్షుల కిలకిలారావాలు, ఉదయాన్నే మేలుకొలిపే సూర్య కిరణాలు.. ఇవన్నీ మన ఇంటి చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదూ? మరి అలాంటి ప్రాజెక్టు ఒకటి వస్తోంది. అటు పట్టణ జీవనశైలి, ఇటు ప్రకృతి పరవశం.. రెండూ కలిసిన అద్భుతమైన ప్రాజెక్టే బొల్లినేని బయాన్. మీ శరీరం, మనస్సు, ఆత్మను పునరుజ్జీవింప చేసే అపరిమితమైన ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన హైదరాబాద్ ల్యాండ్ మార్క్ కమ్యూనిటీ ఇది. 230 ఎకరాల బొటానికల్ గార్డెన్ ఎదురుగా హైటెక్ సిటీ, గచ్చిబౌలికి సమీపంలో ఈ ప్రాజెక్టు వస్తోంది. ఇందులో మీ ప్రతి అవసరం లేదా కోరిక తీర్చే అంశం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు.. ప్రతి వయసువారికీ కూడా ఏదో ఒకటి ఉంటుంది.
హైదరాబాద్ లోని అతిపెద్ద మాల్ కు పక్కనే ఉండటంతోపాటు బొటానికల్ గార్డెన్ కు ఎదురుగా ఉండటంతో పచ్చని పరిసరాలను ఆస్వాదిస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఐటీ హబ్ కు దగ్గర్లో ఉండటమే కాకుండా హైదరాబాద్ లోని ఇతర ప్రదేశాలకు మంచి కనెక్టివిటీ కూడా కలిగి ఉంది. బొల్లినేని బయాన్ లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. వైవా, ఎలాన్, పనాష్, జెస్ట్, బ్రియో పేరుతో వీటిని నిర్మిస్తున్నారు. క్లబ్ హౌస్, ఫిట్ నెస్ లాంజ్, జిమ్నాజియం, క్రెష్, కాఫీ షాప్, యాంఫి థియేటర్, మెడిటేషన్ సెంటర్, వర్క్ స్పేసెస్ వంటి ఎన్నో సౌకర్యాలున్నాయి. బొల్లినేని బయాన్ లో జీవితం నిజంగా ఆనందమయం.
* లొకేషన్ పరంగా కూడా మంచి ప్లేస్ లో ఉండటం ఈ ప్రాజెక్టు మరో ప్రత్యేకత. చిరెక్ ఇంటర్నేషన్ స్కూల్, కిమ్స్ ఆస్పత్రులు 1.5 కిలోమీటర్ల దూరంలో, జైన్ హెరిటేజ్ స్కూల్ 2 కిలోమీటర్లు, ఇనార్బిట్ మాల్ రెండున్నర కిలోమీటర్లు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, హఫీజ్ పేట ఎంఎంటీఎస్ 3 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ నాలుగు కిలోమీటర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బాలయోగి ఇండోర్ స్టేడియం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పంజగుట్ట 12 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. శంషాబాద్ ఎయిర్ పోర్టు 40 నిమిషాల దూరంలో ఉంది. 1840 చదరపు అడుగుల నుంచి 2290 చదరపు అడుగుల మధ్యలో 3 బీహెచ్ కే, 3350 చదరపు అడుగులు పరిమాణంలో 4 బీహెచ్ కే ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ధర రూ.2.30 కోట్ల నుంచి ప్రారంభం. మరి వెంటనే బొల్లినేని బయాన్ పై ఓ లుక్కేసి రండి.