ఎస్టీపీల బయోగ్యాస్ ను బయో సీఎన్‌జీగా కన్వర్షన్
పర్యావరణం పరిరక్షణ
గాలి కాలుష్యం తగ్గుముఖం
జలమండలికి ఆదాయం
దానకిశోర్ నేతృత్వంలో గతంలో ఆరంభం
ఆరంభమైన అంబర్‌పేట్ సీఎన్జీ ప్లాంట్
సమర్థులైన ఐఏఎస్ అధికారులు ఉండటం వల్ల.. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకెంతో మేలు జరుగుతుందని చెప్పడానికి నిదర్శనమిది. ఎస్టీపీల నుంచి వచ్చే బయో గ్యాస్‌ను బయో సీఎన్‌జీగా మార్చి వేస్తే ఉపయోగం ఉంటుందని గతంలో జలమండలి ఎండీగా ఉన్న రోజుల్లో దానకిశోర్ భావించారు. దీని వల్ల గాలి కాలుష్యం గణనీయంగా తగ్గితే అక్కడి స్థానికులు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించినట్లు అవుతుందని అనుకున్నారు. దాంతో పాటు జలమండలికి క్రమం తప్పకుండా కొంత ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. బయో సీఎన్‌జీ ఇంధనాన్ని వాడితే పర్యావరణాన్ని కాపాడినట్లేనని అర్థం చేసుకున్న ఆయన.. సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఆరంభించిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాల్ని ఇస్తుందని గతంలోనే అంచనా వేశారు. ఎస్టీపీ బయో గ్యాస్ ని బయో సీఎన్జీ గా మార్చే ప్రక్రియను అప్పట్లోనే శ్రీకారం చుట్టారు. అంబర్‌పేట్ సీఎన్జీ ప్లాంట్ పూర్తి కావడంతో.. దానకిశోర్ అంచనాలు వాస్తవరూపం దాల్చాయి.
339 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన అంబర్ పేట ఎస్టీపీ, 172 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన నాగోల్ ఎస్టీపీ నుంచి ఉత్పత్తి అయ్యే బయో గ్యాస్ ను బయో సీఎన్జీగా మార్చే ప్రక్రియకు జలమండలి శ్రీకారం చుట్టింది.
ఈ రెండు ఎస్టీపీలు యూఏఎస్బీ (అప్ ఫ్లో అనారోబిక్ స్లడ్జ్ బ్లాంకెట్) టెక్నాలజీ కలిగి ఉన్నాయి. అంబర్ పేట ఎస్టీపీ రోజుకు 5000 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ను, నాగోల్ ఎస్టీపీ రోజుకు 2000 క్యూబిక్ మీటర్ల బయో గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. బయో ఇంధనంగా మార్కెట్ లో అమ్మకానికి వీలైన బయో సీఎన్జీని మార్చడానికి ఇది అనుకూలత కలిగి ఉంది.
అంబర్ పేట, నాగోల్ ఎస్టీపీల నుంచి ఉత్పత్తయ్యే ముడి బయో గ్యాస్ ను హెచ్ పీ సీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి అధీకృత ఏజెన్సీలకు విక్రయించడానికి.. అవి ఆ బయో గ్యాస్ ను విక్రయించడానికి అనువుగా బయో సీఎన్జీగా మార్చడానికి సర్క్యులర్ ఎకానమీ కింద, జలమండలి చొరవ తీసుకుంది.
ఈ మేరకు 2022 అక్టోబర్ లో ఓపెన్ టెండర్లు పిలిచి ఎనర్జాన్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క క్యూబిక్ మీటర్ ముడి బయో గ్యాస్ అమ్మకానికి రూ.1.90 చెల్లించేలా 15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. ఏటా ముడి బయో గ్యాస్ రేటు 5 శాతం చొప్పున పెరుగుతుంది.
అంతేకాకుండా ఒప్పందం ప్రకారం.. బయో గ్యాస్ స్టోరేజీ యూనిట్, స్క్రబ్బింగ్ యూనిట్, చిల్లింగ్ ప్లాంట్, సక్షన్ కంప్రెషర్లు, లో ప్రెజర్, హై ప్రెజర్ కంప్రెషర్లు, మెంబ్రేన్ ఫిల్టర్లు, గ్యాస్ ఫిల్లింగ్ యూనిట్ తదితరాలతో కూడిన సీఎన్జీ ప్లాంట్ మొత్తం మూలధన వ్యయాన్ని ఏజెన్సీయే పెట్టుబడి పెడుతుంది.
అంబర్ పేట ఎస్టీపీ వద్ద సీఎన్జీ ప్లాంట్ ప్రారంభమైంది. నాగోల్ ఎస్టీపీలో ప్లాంట్ ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి.
అంబర్ పేట ఎస్టీపీ ద్వారా మొదటి సంవత్సరం రూ.34.67 లక్షల ఆదాయం వస్తుంది. 15వ సంవత్సరానికి అది రూ.68.65 లక్షలకు చేరుతుంది. మొత్తం 15 ఏళ్లలో 748.23 లక్షల ఆదాయం సమకూరుతుంది.
నాగోల్ ఎస్టీపీ ద్వారా మొదటి సంవత్సరం రూ.13.87 లక్షల ఆదాయం వస్తుంది. 15వ సంవత్సరానికి అది రూ.27.46 లక్షలకు చేరుతుంది. 15 ఏళ్లలో 299.29 లక్షల ఆదాయం సమకూరుతుంది.
మొత్తమ్మీద రెండు ప్లాంట్ల ద్వారా 15 ఏళ్లలో రూ.1047.53 లక్షల ఆదాయం వస్తుంది
This website uses cookies.