Categories: LATEST UPDATES

ఉప్పల్ ప్లాట్లకు అద్భుత స్పందన

  • రెండోసారి ప్రీబిడ్ కు అనూహ్య స్పందన
  • ఎక్కువ ఈఎండి ద్వారా ఎక్కువ ప్లాట్ల వేలంలో అవకాశం
  • సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చిన ఎంఎస్ టిసి అధికారులు
  • నిత్యం సైట్ ఆఫీసును సందర్శిస్తున్న రియాల్టర్లు
  • పెద్ద ప్లాట్లపై ఆసక్తి చూపుతున్న డెవలపర్లు
  • హెచ్ఎండిఏకు ఇది ‘ఐదో ఈ‌‌–ఆక్షన్’

రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌: అన్ని విధాలుగా మౌళిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల నమ్మకానికి నిదర్శనంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ప్లాట్లకు రియల్టర్ల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న డెవలపర్ల విజ్ఞప్తి మేరకు ఉప్పల్ భగాయత్ వెంచర్ లోని 44 ప్లాట్లకు శనివారం బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన సెకండ్ ప్రీబిడ్ మీటింగ్ విజవంతం అయ్యింది. హెచ్ఎండిఏ సెక్రెటరీ సంతోష్ ఐఏఎస్, చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రీబిడ్ మీటింగ్ కు హాజరైన వారు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 44 ప్లాట్ల కు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్ లైన్ వేలం జరిపేందుకు సన్నాహాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే అనేక బహుళ అంతస్థుల భవనాలతో విలసిల్లుతున్న ఉప్పల్ భగాయత్లో ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారని, వేలంలో పాల్గొని ఎక్కువ ప్లాట్లను కైవసం చేసుకునేందుకు వీలుగా వారు(కొనుగోలుదారులు) తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేలం ప్రక్రియను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి అధికారులు రేణుపురుషోత్తం, ఉమేష్ చంద్ర సాంకేతిక అంశాలను వివరించారు.

గత నాలుగేండ్లలో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న ఉప్పల్ భగాయత్ 44 ప్లాట్ల విక్రయాలు ఐదోసారి ఈ–ఆక్షన్(వేలం) కు ప్రజల నుంచి మంచి స్పందన రావడం గర్వంగా ఉందని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. 2018 సంవత్సరంలో తొలిసారి ఈ–ఆక్షన్ లో 105 స్టే బిట్స్ అమ్మకాలు జరిపామని, ఆతర్వాత 2019లో ఉప్పల్ భగాయత్ లో రెండు పర్యాయాలు, ఈ ఏడాది(2021)లో కోకాపేట, ఇప్పుడు ఉప్పల్ భగాయ్ ఈ–ఆక్షన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. హెచ్ఎండిఏ చేస్తున్న లే అవుట్లు అరవై(60) శాతం ఓపెన్ స్పెసెస్ ఉండడం, క్లియర్ టైటిల్స్ తో ఉండడం వల్ల సామాన్య ప్రజల నుంచి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు హెచ్ఎండిఏ వెంచర్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉప్పల్ వెంచర్ కు వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని పక్కనే ఉన్న మిగిలిన స్థలాలను అభివృద్ధి(డెవలప్ మెంట్) చేస్తామన్నారు.
ఉప్పల్ భగాయత్ లో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు, హాస్పిటల్స్ కు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిటూషన్స్, షాపింగ్ కమ్ ఎంటర్ టైన్ మెంట్స్ భవన నిర్మాణాలకు అనువుగా వివిధ కేటగిరిల్లో 150 గజాల నుంచి 5,448 గజాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత నెల రోజుల్లో 1,500 మందికి పైగా ప్లాట్ల కోసం హెచ్ఎండిఏ వెబ్ సైట్ ను సందర్శించారని, ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ)లు గుగూల్ మ్యాప్ ద్వారా ఉప్పల్ వెంచర్ ప్లాట్లను చూసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్, ఈఎండి పేమెంట్స్, ప్లాట్ రాని పక్షంలో ఈఎండి రిటర్న్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు.
ఆన్ లైన్ వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారికి ఈతర్వాత ఒకటి రెండు రోజుల్లో ఇంటిమేషన్ లెటర్స్ అందజేస్తామని, ఆతర్వాత మొత్తంలో 25 శాతం చెల్లించినట్లయితే హెచ్ఎండిఏ నుంచి ఎన్ఓసీ ఇస్తామని, దాని ఆధారంగా మిగతా 75 శాతం నిధులను నాలుగు బ్యాంకులు(ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, కొటెక్ మహేంద్ర బ్యాంక్, ఐసిఐసీఐ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంక్) నుంచి రుణం పొందే అవకాశం ఉండని వివరించారు. కొనుగోలుదారులు హెచ్ఎండిఏ నుంచి కూడా వాయిదాలను పొందవచ్చని, పది(10) శాతం వడ్డీతో హెచ్ఎండిఏకు వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చని వెల్లడించారు.

This website uses cookies.