రాష్ట్రంలో ప్రకృతి సౌందర్య ప్రాంతాలకు ఓబెరాయ్, మేఫైర్ వంటి సంస్థలు ఫిదా అవుతున్నాయి. ఇప్పటికే తిరుపతి, గండికోట, పిచ్చుకలంకలో రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర స్వదేశీ దర్శన్ పథకం ద్వారా అరకు, లంబసింగిని అడ్వంచర్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ భావిస్తోంది. బొర్రా గుహల్లో మంచి సౌండ్, లైటింగ్ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.
బ్లూఫాగ్ బీచ్ గా రుషికొండ బీచ్ ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నీరున్న పర్యాటక ప్రాంతాల్లో వాటర్ స్పోర్స్ట్ ను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రసాద్ స్కీం క్రింద (పిలిగ్రమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరుచ్యువల్ హెరిటేజ్ అగ్నమంటేషన్ డ్రైవ్) అన్నవరం పుణ్యక్షేత్రాన్నిరూ. 25.32 కోట్లతో అభివృద్ధి చేస్తుండటం విశేషం.