– రాష్ట్ర బడ్జెట్ లో వెల్లడి
హైదరాబాద్ శివార్లలో శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ నగరంపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ లో పేర్కొంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు, ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. అందులో పనిచేసేవారు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి రోజూ వెళ్లి వస్తుంటారని, అలాంటివారికి ఈ టౌన్ షిప్స్ ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. అదే సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టెయినింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని తెలిపింది. ఈ శాటిలైట్ టౌన్ షిప్స్ లో అందుబాటు ధరల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలను ప్రోత్సహిస్తామని… వీటిలో పార్కులు, కమ్యూనిటీ హాల్స్, వాణిజ్య ప్రాంతాలు, పాఠశాలలు వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపింది.