ప్రభుత్వం మారడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు మళ్లీ విచ్చుకుంటున్నాయ్. మరీ ముఖ్యంగా క్యాపిటల్ ఏరియా అమరావతిలో స్థిరాస్తి రంగం పుంజుకోవడం మొదలైంది. రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకుల్ని ప్రభుత్వం క్లియర్ చేస్తుండటం.. త్వరలోనే వర్క్స్ స్టార్ట్ కానుండటంతో రియాల్టీ ప్రాజెక్ట్‌ల కన్‌స్ట్రక్షన్స్ జోరుగా సాగుతున్నాయ్. ఇక హైద్రాబాద్‌లో విరివిగా కనిపించే గేటెడ్ కమ్యూనిటీల కల్చర్ అమరావతిలోనూ మొదలైంది. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో అనేక గేటెడ్ కమ్యూనిటీలు డెవలప్ అవుతున్నాయ్. నిన్నటివరకూ ప్రాభవాన్ని కోల్పోయిన ఈ కమ్యూనిటీల్లో.. కూటమి సర్కార్ రాకతో.. మళ్లీ నూతనోత్సాహంగా కనిపిస్తున్నాయ్. పాత ప్రాజెక్టులతో పాటు కొత్తవాటికీ డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. మరి, అమరావతికి చేరువగా ఉన్న కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, వెంచర్ల గురించి.. ఆర్ఈజీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.
గత ఐదేళ్లు పాతాళానికి పడిపోయి హెల్పింగ్ హ్యాండ్ కోసం ఎదురుచూసింది ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగం. గవర్నమెంట్ ఛేంజ్ కావడంతో ఆటమేటిగ్గా ఏపీలో రియాల్టీ సెక్టార్‌కి మళ్లీ ఊపిరొచ్చింది. ఓవర్‌నైట్‌లో అద్భుతాలు జరుగుతున్నాయని కాదు కానీ.. నిస్తేజం నుంచి బయటపడి యాక్టివిటీ అయితే మొదలైంది. రాజధాని పనులు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో క్లారిటీ రావడంతో నిర్మాణ రంగానికి కొత్త జవసత్వాలు వచ్చాయిక్కడ. ఇవన్నీ కలిసి అమరావతిలో 2014- 2019 మధ్యలో ఉన్న ఉత్సాహం రిపీటవుతోంది రియాల్టీ సెక్టార్‌లో. బిల్డర్లు అనేక కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారక్కడ. ఇండివిడ్యువల్ హౌసెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రాలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున నిర్మితమవుతుండటం చెప్పుకోవాల్సిన విషయమే. అమరావతిలో కస్టమర్లను ఆకర్షించేలా ఆ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లను చూస్తే…
ప్రాజెక్ట్- కావూరి డెవలపర్స్- గ్రాండ్ ప్రాజెక్ట్
లొకేషన్- ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ సమీపంలో, అమరావతి
యూనిట్ టైప్- 2 & 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్స్
యూనిట్ సైజ్- 1190-2240 చదరపు అడుగులు
కోర్ క్యాపిటల్ ఏరియాలో కావూరి హిల్స్ డెవలపర్స్ చేపట్టిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్- గ్రాండ్ ప్రాజెక్ట్. అమరావతిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ సమీపంలో ఉంది ఈ గ్రాండ్ ప్రాజెక్ట్. 6.9 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాజెక్ట్‌లో 4 హై రైజ్ రెసిడెన్షియల్ టవర్స్ డిజైన్ చేశారు. ఒక్కో టవర్‌లో 14 అంతస్థులు కాగా 1190 నుంచి 2240 చదరపు అడుగుల మధ్యలో టూ అండ్ త్రీ బీహెచ్‌కే యూనిట్లు ప్లాన్ చేశారు. క్లబ్‌హౌస్, విజయవాడలో మొదటిసారిగా మినీప్లెక్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అలాగే మహిళల కోసం వుమెన్ ఓన్లీ పూల్, మినీ షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్ అండ్ కేఫే సహా వరల్డ్ క్లాస్ అమెనిటీస్ ప్లాన్ చేశారు.
ప్రాజెక్ట్- మంజీరా మోనార్క్
లొకేషన్- ఎన్‌హెచ్-16 సర్వీస్ రోడ్, మంగళగిరి
యూనిట్ టైప్- 2, 3 & 4 బీహెచ్‌కే
యూనిట్ సైజ్- 1070-2724 చదరపు అడుగులు
ప్రాజెక్ట్ స్టేటస్- రెడీ టూ మూవ్
రెరా రిజిస్ట్రేషన్ నంబర్- P07120040007
రాజధాని అమరావతికి దగ్గర్లో డిజైన్ చేసిన మరో లగ్జరీ ప్రాజెక్ట్ మంజీరా మోనార్క్. మంగళగిరిలో ఉండటంతో ఇటు విజయవాడకు కూడా దగ్గరే. లావిష్ లైఫ్‌స్టైల్ కోరుకునే వారికి మంజీరా మోనార్క్ ఫస్ట్ ఛాయిస్ అనేలా ప్లాన్ చేశారు. 5 ఎకరాల్లో తీర్చిదిద్దిన ఈ ప్రాజెక్టులో 1070 నుంచి 2724 చదరపు అడుగుల రేంజ్‌లో టూ, త్రీ అండ్ ఫోర్ బీహెచ్‌కే యూనిట్లు ఉన్నాయ్. మొత్తం 567 ఫ్లాట్స్ ఉన్నాయిందులో. మంగళగిరిలో ఉండటంతో లొకేషన్‌పరంగా స్ట్రాటజిక్‌గా కలిసొచ్చే విషయం. ఇక్కడ్నుంచి రాజధాని అమరావతికి విజయవాడ, గుంటూరు ఏ ప్రాంతానికైనా ఈజీగా చేరుకోవచ్చు.
నిర్మాణంలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు ఒకెత్తు అయితే.. గేటెడ్ కమ్యూనిటీలు.. విల్లాల కోసం డెవలప్ అవుతోన్న ప్లాట్లు మరో ఎత్తు. కస్టమర్ల నుంచి ప్లాట్ల గురించి ఎంక్వైరీలు.. కొనుగోలు చేసే వాటిల్లో వీటి సంఖ్యే ఎక్కువగా ఉండటంతో అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్లాట్ల నిర్మాణాలు, వేగంగా జరుగుతున్నాయ్. పదేళ్ల క్రితం రాజధాని అమరావతిని ప్రకటించినప్పట్నుంచి ఈ ప్రాంతంలో ప్లాట్లకు వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయాలని వారు పెరగడంతో రాజధానితో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్లాట్లు పెరిగిపోయాయ్. క్యాపిటల్ రీజియన్, రివర్‌ఫ్రంట్ అంటూ గేటెడ్ కమ్యూనిటీ అండ్ విల్లాల కోసం ప్రత్యేకంగా ప్లాట్లను డెవలప్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.
ప్రాజెక్ట్- వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా
లొకేషన్- ఖాజా
ల్యాండ్ సైజ్- 24 ఎకరాలు
ప్లాట్ రేంజ్- 180-731 చదరపు గజాలు
ప్రాజెక్ట్ స్టేటస్- డెవలప్మెంట్ కంప్లీటెడ్
అమరావతికి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా ప్రాజెక్ట్. 24 ఎకరాల్లో ఇప్పటికే డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో 180 నుంచి 731 చదరపు గజాల్లో ఓపెన్ ప్లాట్లను డిజైన్ చేశారు. మొత్తం గ్రీన్ సరౌండింగ్‌తో వృద్ధి చేసిన క్యాపిటల్ విస్టాలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 40 అడుగుల వెడల్పైన బీటీ రోడ్లు, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్‌తో ల్యాండ్‌స్కేప్డ్ పార్క్స్, సిగ్నేచర్లతో రోడ్లు, ఆర్‌ఓ వాటర్ ఫ్యూరిఫైయర్స్, అన్ని ప్లాట్లకు ఓనర్ పేరు ప్లాట్ నంబర్లతో సైనింగ్ బోర్డ్స్ లాంటి సదుపాయాలున్నాయ్. క్యాపిటల్ రీజియన్‌లో ఉండటంతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉన్న వెంచర్ ఇదొక్కటే.
ప్రాజెక్ట్- వెర్టెక్స్ క్యాపిటల్ విస్టా వెస్ట్
లొకేషన్- కంతేరు, అమరావతి
ల్యాండ్ సైజ్- 23 ఎకరాలు
వెర్టెక్స్ డెవలప్ చేసిన మరో ప్రాజెక్ట్ క్యాపిటల్ విస్టా వెస్ట్. అమరావతిలోని కంతేరులో 23 ఎకరాల్లో డెవలప్ చేశారీ ప్రాజెక్ట్‌ని. క్యాపిటల్ విస్టా వెస్ట్ నుంచి అమరావతికి దూరం జస్ట్ వన్ కిలోమీటరే. దీన్ని కూడా మొత్తం గ్రీన్ సరౌండింగ్‌తో వృద్ధి చేశారు. క్యాపిటల్ విస్టాలో మాదిరే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, 40 అడుగుల వెడల్పైన బీటీ రోడ్లు, సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్‌తో ల్యాండ్‌స్కేప్డ్ పార్క్స్, సిగ్నేచర్లతో రోడ్లు, ఆర్‌ఓ వాటర్ ఫ్యూరిఫైయర్స్, అన్ని ప్లాట్లకు ఓనర్ పేరు ప్లాట్ నంబర్లతో సైనింగ్ బోర్డ్స్ లాంటి సదుపాయాలున్నాయ్. ఇప్పటికే ఈ ఏరియాలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్‌లు వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్లాట్లు కొనే వారి సంఖ్యా పెరిగింది.
ప్రాజెక్ట్- శ్రీ సవిత్రు టౌన్‌షిప్
లొకేషన్- చావపాడు, అమరావతి
ప్లాట్ రేంజ్- 150-400 చదరపు గజాలు
PUDA నంబర్- P.NO.19/2024/1195/DTCP/DPMS
అమరావతిలో శ్రీ సవిత్రు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లను నిర్మిస్తోంది. వినియోగదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం తమ లక్ష్యమంటోన్న ఈ సంస్థ అమరావతిలోని చావపాడులో శ్రీ సవిత్రు టౌన్‌షిప్ పేరుతో ఓపెన్ ప్లాట్లను డెవలప్ చేస్తోంది. 150 నుంచి 400 చదరపు గజాల రేంజ్‌లో ఉన్న ఈ ప్లాట్లు ఏపీ సీఆర్‌డీఏ అనుమతులు పొందినవే. ఈ టౌన్‌షిప్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్. చావపాడు- వడ్డమానులో ఇప్పటికే అభివృద్ధి పట్టాలెక్కింది. తూళ్లురు, వెలగపూడి, మంగళగిరి, తాడేపల్లి లాంటి కోర్ క్యాపిటల్‌లో ఉన్న ప్రాంతాలన్నీ సవిత్రు టౌన్‌షిప్‌కు దగ్గర్లోనే ఉన్నాయ్.