Categories: TOP STORIES

ఐటీ ఉద్యోగాల్లో పెరుగుదల

తెలంగాణలో 156 శాతం వృద్ధి నమోదు

తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పెరిగాయని.. 2014లో ఈ రంగంలో దాదాపు 3.23 లక్షల ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం అవి 8,27,124కి చేరాయని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు 156 శాతం మేర పెరిగినట్టు వివరించారు. అదే సమయంలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ1,83,569 కోట్లకు పెరిగాయని తెలిపారు. 2023-24 బడ్జెట్ లో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. టైర్-2 నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ టవర్లు నిర్మించినట్టు వివరించారు. అలాగే నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, సిద్దిపేటల్లో అవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇవి వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తాయని వివరించారు.

* తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014 నుంచి 2021 మధ్యకాలంలో ఐటీ ఎగుమతుల కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 15.67 శాతంగా నమోదైందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. రియల్ ఎస్టేట్, నివాస, వృత్తిపరమైన సేవల యాజమాన్యం అనేది రాష్ట్రంలోని సేవల రంగంలో అత్యంత ప్రధానమైన ఉపరంగమని.. ప్రైమ్ ఆఫీసుల విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా ఉన్న హైదరాబాద్ లో అద్దె వృద్ధి అసాధారణంగా ఉందని పేర్కొంది. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికి ఇన్నోవేషన్, టెక్నాలజీలు ప్రధాన అంశాలని స్పష్టం చేసింది

This website uses cookies.