poulomi avante poulomi avante

గుంటూరులో ఇళ్ల ధరలూ ఘాటే

51 శాతం మేర పెరిగిన వైనం

దేశవ్యాప్తంగా టైర్-2 పట్టణాల్లో 65 శాతం వరకు పెరిగిన ఇళ్ల ధరలు

అత్యధికంగా జైపూర్ లో 65 శాతం పెరుగుదల

విశాఖలో 29 శాతం, విజయవాడలో 21 శాతం వృద్ధి

ప్రాప్‌ ఈక్విటీ నివేదిక వెల్లడి

గుంటూరు మిర్చి తరహాలోనే అక్కడ ఇళ్ల ధరలూ ఘాటుగా మారాయి. గతేడాదితో పోలిస్తే గుంటూరులో ఇంటి సగటు ధర ఏకంగా 51 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో (టైర్‌-2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 253 పట్టణాల్లో సగటున 65 శాతం వరకు ధరలు పెరగ్గా.. ఐదు పట్టణాల్లో కాస్త తగ్గినట్టు ప్రాప్‌ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరులో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల ఉండగా.. విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి.

దక్షిణాదిలో చూస్తే.. మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో 4 శాతం, మైసూర్‌లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. టైర్‌-2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్‌ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి-సెప్టెంబర్‌ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.6,979కు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ ధర రూ.4,240గా ఉంది. ఇక ఉత్తారాదిని పరిశీలిస్తే.. ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది.

భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి. పశ్చిమభారత్‌లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. డెవలపర్లు, కార్పొరేట్‌లు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి టైర్-2 నగరాల్లోని ఇళ్లకు ఆసక్తి పెరిగిందని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్‌ జసూజా తెలిపారు. ఈ పట్టణాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానం, బలమైన డిమాండ్‌ వంటి అంశాలు ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడటానికి కారణాలని పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles