Categories: PROJECT ANALYSIS

హ్యాపీ ప్రాజెక్టు ఇదే!

ఆనందం యొక్క చిరునామా.. ప్రకృతికి ఎంతో సమీపంగా మనసు… శరీరం… హృదయానికి ఆనందాన్ని అందించే సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ఆరంభమైంది… అదే.. హ్యాపినెస్ హ‌బ్ @ కిస్మ‌త్ పూర్.. డెవ‌ల‌ప్డ్ బై.. గిరిధారి హోమ్స్‌!

హైదరాబాద్‌లో ప్ర‌తిఏటా బిల్డ‌ర్లు వంద‌లాది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కొన్నింట్లో స‌దుపాయాలు మెరుగ్గా ఉంటే.. మ‌రికొన్నింట్లో ప‌చ్చ‌ద‌నం ఆక‌ర్షిస్తుంది. అయితే, ఆనందాన్ని అందించే క‌ట్ట‌డాలు పెద్ద‌గా లేవ‌నే చెప్పాలి. అందుకే, న‌గ‌రంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా.. సంతోషాన్ని అందించే స‌రికొత్త గేటెడ్ క‌మ్యూనిటీ ఆరంభ‌మైంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే చాలు.. ఆనందమే ఆనందం.. ఎందుకో తెలుసా? హైద‌రాబాద్‌లో హ్యాపినెస్ సొసైటీని అభివృద్ధి చేయాల‌న్న కంకణం క‌ట్టుకుని కిస్మ‌త్‌పూర్‌లో హ్యాపినెస్ హ‌బ్ ను ఆర‌భించింది.

గిరిధారి హోమ్స్ గ‌త ప‌దిహేనేళ్లలో.. త‌మ ప్రాజెక్టుల‌న్నీ ఎక్కువ‌గా అప్పా జంక్ష‌న్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే చేప‌ట్టింది. ఇందుకు గ‌ల ప్ర‌ధాన కార‌ణం.. క‌నెక్టివిటీ! దుబాయ్ కానీ, మలేసియా కానీ, సింగపూర్ కానీ.. ఇలా అభివృద్ధి చెందిన ఏ న‌గ‌రాన్ని చూసినా.. ఎయిర్ పోర్టు నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే ర‌హ‌దారులే డెవ‌ల‌ప్ అయ్యాయి. ఈ సంస్థ మొద‌టి ప్రాజెక్టును ఆరంభించిన‌ప్పుడే.. ఔటర్ రింగ్ రోడ్డు ఆరంభ‌మైంది. దాంతో ఆ ప్రాంత‌మంతా ఫ్యూచర్ దుబాయ్ గా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని సంస్థ‌కు అర్థ‌మైంది. ఇలాంటి రోడ్ల‌లోనే ఎక్కువ‌గా హైరైజెస్‌లోనే ఉన్నాయి.

అందుకే, ఈ సంస్థ అప్పా జంక్ష‌న్‌ను ఎంచుకుంది. ఈ ప్రాంతం ప్ర‌కృతికి చేరువ‌గా ఉండ‌టమే కాదు.. అభివృద్ధికి ఎక్కువ‌గా అస్కారం ఉంద‌ని గ్ర‌హించింది. ఎందుకంటే, 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హియాయత్ సాగర్ లేక్ స‌మీపంలో ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే.. 6 వేల ఎక‌రాల్లో మృగవని పార్కు, 3 వేల ఎక‌రాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6 వేల ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది. 30 శాతం కంటే ఎక్కువ గ్రామాలు కానీ, గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రానీ ఏరియా ఏదైనా ఉంటే అది ఇదేన‌ని అంచ‌నా వేసింది. పైగా, అతిత్వ‌ర‌లో మెట్రో రైల్వే స్టేష‌న్ ఏర్పాటు కానుంది. గిరిధారి ప్రాజెక్టు ముందు నుంచే వంద అడుగుల రోడ్డు కూడా అభివృద్ధి చేస్తున్నారు.

This website uses cookies.