హైదరాబాద్‌లో ప్రతిఏటా బిల్డర్లు వందలాది ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. కొన్నింట్లో సదుపాయాలు మెరుగ్గా ఉంటే.. మరికొన్నింట్లో పచ్చదనం ఆకర్షిస్తుంది. అయితే, ఆనందాన్ని అందించే కట్టడాలు పెద్దగా లేవనే చెప్పాలి. అందుకే, నగరంలోనే ప్రప్రథమంగా.. సంతోషాన్ని అందించే సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ఆరంభమైంది. ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తే చాలు.. ఆనందమే ఆనందం.. ఎందుకో తెలుసా?
గిరిధారి హోమ్స్ గత పదిహేనేళ్లలో.. తమ ప్రాజెక్టులన్నీ ఎక్కువగా అప్పా జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చేపట్టింది. ఇందుకు గల ప్రధాన కారణం.. కనెక్టివిటీ! దుబాయ్ కానీ, మలేసియా కానీ, సింగపూర్ కానీ.. ఇలా అభివృద్ధి చెందిన ఏ నగరాన్ని చూసినా.. ఎయిర్ పోర్టు నుంచి సిటీకి కనెక్ట్ అయ్యే రహదారులే డెవలప్ అయ్యాయి. ఈ సంస్థ మొదటి ప్రాజెక్టును ఆరంభించినప్పుడే.. ఔటర్ రింగ్ రోడ్డు ఆరంభమైంది. దాంతో ఆ ప్రాంతమంతా ఫ్యూచర్ దుబాయ్ గా డెవలప్ అవుతుందని సంస్థకు అర్థమైంది. ఇలాంటి రోడ్లలోనే ఎక్కువగా హైరైజెస్‌లోనే ఉన్నాయి. అందుకే, ఈ సంస్థ అప్పా జంక్షన్‌ను ఎంచుకుంది. ఈ ప్రాంతం ప్రకృతికి చేరువగా ఉండటమే కాదు.. అభివృద్ధికి ఎక్కువగా అస్కారం ఉందని గ్రహించింది. ఎందుకంటే, 40 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో హియాయత్ సాగర్ లేక్ సమీపంలో ఉంది. అప్పా జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ చూసుకుంటే.. 6 వేల ఎకరాల్లో మృగవని పార్కు, 3 వేల ఎకరాల్లో ఆర్మీ ఏరియా వంటివి ఉన్నాయి. ఏజీ యూనివర్సిటీలో 6 వేల ఎకరాలకు పైగా ఓపెన్ స్పేస్ ఉంది. 30 శాతం కంటే ఎక్కువ గ్రామాలు కానీ, గ్రౌండ్ కవరేజ్ ఫరెవర్ రానీ ఏరియా ఏదైనా ఉంటే అది ఇదేనని అంచనా వేసింది. పైగా, అతిత్వరలో మెట్రో రైల్వే స్టేషన్ ఇక్కడే ఏర్పాటు కానుంది. గిరిధారి ప్రాజెక్టు ముందు నుంచే వంద అడుగుల రోడ్డు కూడా అభివృద్ధి చేయనున్నారు.
హ్యాపినెస్ హబ్.. ఈ పేరులోనే ఆనందం ఉంది.. కొనుగోలుదారులకు చెప్పినట్లుగానే ఆనందాన్ని అందించేందుకు గిరిధారి సంస్థ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. అందుకే, ఈ ప్రాజెక్టు కోసం ఎంతో వ్యూహాత్మక ప్రాంతమైన కిస్మత్ పూర్‌ను ఎంచుకుంది. ఇందులో నివసించేవారు.. ప్రతి సంబురాన్ని సంతోషంగా జరుపుకోవచ్చు.. చిన్నారుల బాల్యం ఆనందంగా గడిచిపోతుంది.. ప్రతిఒక్కరూ సంతోషమైన కబుర్లు చెప్పుకోవచ్చు.. పెద్దల సెకండ్ ఇన్నింగ్స్ ఆనందంగా ఆరంభం అవుతుంది.. కుటుంబంతో కలిసి సినిమాను ఆస్వాదించొచ్చు.. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, రిలాక్సేషన్, భద్రత.. ఇలా ప్రతి అంశంలోనూ ఆనందించాలంటే.. సంతోషాన్ని అందించే గృహాన్ని ఎంచుకోవాలి..
ఏ ప్రాజెక్టుకైనా క్లబ్‌హౌజ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అందుకే, ఇందులోకి వచ్చేవారికి హ్యపీనెస్ను అందించాలనే ఉద్దేశ్యంతో.. హ్యాపీ బాడీస్, హ్యాపీ మైండ్స్, హ్యాపీ సోల్స్, హ్యాపీ హార్ట్స్ అనే సరికొత్త కాన్సెప్ట్ రూపొందించింది. ప్రాజెక్టులోని టవర్లకు ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత వంటి పేర్లను పెట్టారు. బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపినెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. అందులో నివసించేవారు ఎలాంటి ప్రతికూలమైన మానసిక పరిస్థితిలో ఉన్నా.. వాటిని చూడగానే మెదడులో ఆనందానికి సంబంధించిన రసాయనాలు వెలువడతాయి. ఆనందంగా ఉండటం మనిషి యొక్క నిజస్వరూపం. ఎల్లప్పుడు చిదానందంగా ఉండేలా ఆ స్వరూపంలోకి తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
గిరిధారి ఇప్పటివరకు అప్పా జంక్షన్ లో 11 ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిని ఒక కోర్ పర్పస్ తో మొదలు పెట్టారు. కస్టమర్లు 5 స్టార్ ఫెసిలిటీస్ తో ఆనందమయ జీవితం గడపాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు. గిరిధారి ప్రైస్ అప్రిసియేషన్ కూడా చాలా బాగుంది. గిరిధారి విల్లాలను రూ.90 లక్షలకు కొని రూ.4.25 కోట్లకు అమ్ముకున్నారు. వారి మూడు తరాల మొత్తం ఆదాయం కూడా అంత లేదని చెప్పారు. మినిమం 30 శాతం నుంచి మొదలుపెడితే గరిష్టంగా 400 శాతం ప్రైస్ అప్రిసియేషన్ అందుకున్నారు. ఇప్పటి వరకూ 2000 మంది హ్యాపీ కస్టమర్లు ఉన్నారు. 1000 హ్యాపీ ఫ్యామిలీస్ ప్రస్తుత ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లో ఉండటం విశేషం.
హ్యాపినెస్ హబ్
@ కిస్మత్ పూర్
టీఎస్‌పీఏ జంక్షన్ వద్ద
5.47 ఎకరాలు.. 3 టవర్లు
చుట్టుపక్కల ఆరు వేల ఎకరాల్లో పచ్చదనం
హిమాయత్ సాగర్ అందాల్ని వీక్షించొచ్చు
అత్యుత్తమ గాలి నాణ్యత
ప్రత్యేకంగా మెమరీ బ్యాంక్
10 నిమిషాల్లో గ్లెండేల్ అకాడమీ
15 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
20 నిమిషాల్లో బంజారా, జూబ్లీహిల్స్
25 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు
This website uses cookies.