Categories: LATEST UPDATES

ఇళ్ల అమ్మకాలు పెరిగాయా?

కరోనా తర్వాత రియల్ రంగం గాడిన పడింది. గత మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. జనవరి-మార్చి కాలంలో 6,993 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఒక శాతం ఎక్కువ. అదే దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలను పరిశీలిస్తే.. గత మూడు నెలల్లో 78,627 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత నాలుగేళ్లలో.. ఈ కాలంలో జరిగిన అత్యధిక విక్రయాలు ఇవే కావడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది 9 శాతం అధికం. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది.

ఢిల్లీ-ఎన్ సీఆర్ లో గతేడాది కంటే రెట్టింపు విక్రయాలు జరిగాయని.. గత మూడు నెలల్లో అక్కడ 15,019 యూనిట్లను విక్రయించారని పేర్కొంది. అలాగే బెంగళూరులో 34 శాతం వృద్ధితో 13,663 యూనిట్ల అమ్మకాలు జరిగినట్టు వివరించింది. ముబైలో 21,548 యూనిట్లు అమ్ముడవగా.. గతేడాదితో పోలిస్తే ఇది 9 శాతం తక్కువని తెలిపింది. చెన్నైలో కూడా 17 శాతం మేర తగ్గి, 3,376 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని వెల్లడించింది.

మరో రెండు కన్సల్టెంటీ సంస్థలు అన్ రాక్, ప్రాప్ టైగర్ గత వారమే తమ డేటాను విడుల చేశాయి. జనవరి-మార్చి కాలంలో దేశవ్యాప్తంగా 7 నగరాల్లో 99,550 యూనిట్లు అమ్ముడయ్యాయని అన్ రాక్ వెల్లడించగా.. ఇదే సమయంలో 8 ప్రధాన నగరాల్లో 70,623 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు ప్రాప్ టైగర్ పేర్కొంది.

This website uses cookies.