-
2014- 2024 రియాల్టీలో మోడీ ఎఫెక్ట్ పేరిట..
సంయుక్త నివేదిక విడుదల చేసిన నరెడ్కో, అనరాక్
-
రియాల్టీ జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ఎక్కడ?
-
మోడీ నిజంగానే రియాల్టీలో అద్భుతం చేసి ఉంటే..
2020 తర్వాత రియాల్టీ ఎఫ్‌డీఐలు ఎందుకు తగ్గాయ్?
2014 నుంచి 2014 దాకా భారత నిర్మాణ రంగానికి మోడీ చేసిన మేలేంటి? ఆయన తీసుకున్న నిర్ణయాలు రియల్ రంగాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఏయే విభాగంలో నిర్మాణ రంగం అద్భుతమైన ప్రగతి సాధించింది? దేశంలో ఎంతమంది సామాన్యుల సొంతింటి కల తీరింది? జీఎస్టీ వసూళ్ల శాతం ఎంత పెరిగింది? తదితర అంశాల్ని స్పృశిస్తూ.. ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయాల్ని కీర్తిస్తూ.. నరెడ్కో నేషనల్ అనరాక్‌తో కలిసి తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. రాత్రికి రాత్రే ఐదు వందల నోట్ల రద్దు, డీమానిటైజేషన్, జీఎస్టీలను పద్ధతీప్రకారం లేకుండా దేశంలో ప్రవేశపెట్టి.. రియల్ రంగాన్ని నడ్డి విరిచిన నరేంద్రమోడీ.. ఆతర్వాత నిర్మాణ రంగానికి గొప్ప మేలు చేశాడంటూ తాజా నివేదిక ఉండటం విశేషం.
మొన్న తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కారణంగా తెలంగాణ రియల్ రంగం ఎలా వృద్ధి చెందిందనే అంశంతో కొన్ని సంస్థలు నివేదికను వండివార్చినట్టే.. ఈ రిపోర్టు ఉండటం గమనార్హం. భారత ప్రధానిమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికో లేదా ఆయన మెప్పును పొందడం కోసమో ఈ నివేదికను విడుదల చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. గత పదేళ్లలో నిర్మాణ రంగానికి ప్రధాని మోడీ నిజంగానే సరికొత్త దిశానిర్దేశం చేసి ఉన్నట్లయితే.. 2020 తర్వాత నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుముఖం పట్టాయనే విషయాన్ని నివేదికలో పెద్దగా విశదీకరించలేదు.
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు (కోట్లలో)
2018-19 | 2019-20 | 2020-21 | 2021-22 | 2022-23 | |
మహారాష్ట్ర | 1,70,289 | 1,85,917 | 1,65,308 | 2,17,993 | 2,70,346 |
కర్ణాటక | 78,762 | 83,408 | 75,660 | 95,926 | 122821 |
గుజరాత్ | 73,440 | 78,923 | 74,346 | 97,155 | 1,14,222 |
తమిళనాడు | 70,562 | 74,430 | 69,121 | 85,492 | 1,04,377 |
ఉత్తర్ ప్రదేశ్ | 61,323 | 65,281 | 59,721 | 73,865 | 87,969 |
హర్యానా | 55,233 | 59,560 | 54,890 | 68,142 | 86,669 |
పశ్చిమ బెంగాల్ | 39,780 | 43,386 | 39,694 | 47,898 | 58,059 |
ఢిల్లీ | 39,845 | 44,161 | 36,568 | 46,253 | 55,843 |
తెలంగాణ | 36,408 | 39,820 | 36,346 | 45,081 | 51,831 |
ఆంధ్రప్రదేశ్ | 25,331 | 27,108 | 26,163 | 32,710 | 40,233 |
2014లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేస్తే జీఎస్టీ పన్నెండు శాతం చెల్లించాల్సి వచ్చేది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకంటే ఇంత మొత్తం తీసుకునేవారు. అదే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకపోతే గనక ఐదు శాతం వసూలు చేసేవారు. దానికి అనుగుణంగానే కొనుగోలుదారులు జీఎస్టీ చెల్లించేవారు. అయితే, అందుబాటు గృహాలపై 2019లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లయితే 8 శాతం వసూలు చేసేవారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకపోతే గనక 1 శాతం జీఎస్టీని కొనుగోలుదారులు చెల్లించేవారు. అయితే, 2019 నుంచి నేటివరకూ.. ఎన్‌వోసీ వచ్చిన తర్వాత.. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను బయ్యర్లు కొంటే.. జీఎస్టీ చెల్లించకర్లేదు. కాకపోతే, ప్రాజెక్టులు గృహప్రవేశానికి వచ్చేసరికి బిల్డర్లు ధరల్ని పెంచేస్తారనే విషయం తెలిసిందే.