- అందుబాటు ధరల్లో ఇళ్లు ఉన్న ప్రాంతాలేవి?
- వాటి బడ్జెట్ రేంజ్ ఎంత?
- ఫ్యూచర్‌లో డెవలప్మెంట్‌కు స్కోప్ ఏంటి?
గత ప్రభుత్వం పుణ్యమా అంటూ హైదరాబాద్ బాగా ఖరీదైంది. ఇక సొంతిల్లు సంగతి సరే. కనీసం కోటి పెట్టకపోతే ఓ మాదిరి ఇల్లు కూడా దొరక్కట్లేని పరిస్థితి. కాస్త కంఫర్ట్ అండ్ స్పేషియస్ ఫ్లాట్స్ కావాలంటే బడ్జెట్ కోటీ పైనే ఉండాలి.
మహా నగరంలో సొంతింటి ప్రస్తావన వస్తే.. ఇలా కోట్ల చుట్టూ తిరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంత అని రెజ్ న్యూస్ పరిశీలిస్తే.. గ్రౌండ్ రియాల్టీ మరీ ప్రచారం జరుగుతున్నట్టుగా అయితే లేదు. కాస్త ఓపిగ్గా వెతికితే రూ. 40-45 లక్షల రూపాయల్లోనూ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయ్. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ కోటి రూపాయల్లోపు అద్భుతమైన ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్. మరి ఏయే ప్రాంతాల్లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి? బడ్జెట్ రేంజ్‌ను బట్టి ఎలాంటి ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయంటే?
కారణం ఏదైనా హైద్రాబాద్‌లో సొంతిల్లు అంటే భారీ బడ్జెట్ సినిమాలా అయిపోయిందనే ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది. తక్కువలో తక్కువ కోటి రూపాయలు పెడితే కానీ చెప్పుకోతగ్గ స్థాయిలో సొంతిల్లు రాదు. బడ్జెట్ రేంజ్ పెరిగే కొద్దీ లొకేషన్, కంఫర్ట్స్, అమెనిటీస్ అంటూ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయే అంతే తప్ప అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉండట్లేదనే ఫిర్యాదులు ఎక్కువైపోయాయ్. ఇలాంటి ప్రచారాలతో భవిష్యత్‌లో ధరలు ఎలా ఉంటాయోనని ఎగబడి కొనే వారు కొందరైతే.. తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూసే వారు.. మన వల్ల కాదులే అని డ్రాప్ అయ్యే వారు మరికొందదరు. ఓవరాల్‌గా హైదరాబాద్‌లో సొంతిల్లు కావాలన్న కోరిక ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే.. భారీ బడ్జెట్ మాత్రం చాలామందిని భయపెట్టేస్తుంది. మహానగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అంత కష్టమైపోయిందా..? బడాబాబులు తప్ప సామాన్యులు సిటీలో ఇల్లు కొనలేరా..? అందుబాటు ధరల్లో అసలు ఇళ్లే లేవా..? జరుగుతున్న ప్రచారాల్లో నిజమెంత..? అని రెజ్ న్యూస్ గ్రౌండ్ లెవల్లో పరిశీలించగా.. పబ్లిసిటీకి.. రియాల్టీకి మ్యాచ్ అవ్వట్లేదు. క్రౌడ్ పుల్లింగ్ ఏరియాల్లో డిమాండ్ ఉండటం సహజం. అదే సమయంలో నగరంలో అభివృద్ధి చెందుతోన్న మిగిలిన ఏరియాల్లో మాత్రం అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయ్.
ల్యాండ్ బ్యాంక్ ఎక్కువే..
ఎంఎన్‌సీలు.. స్కై స్క్రేపర్స్.. కొత్త ప్రాజెక్ట్‌ల వల్ల హైద్రాబాద్ అంటే వెస్ట్‌జోన్ ఒక్కటే అభిప్రాయం పాతుకుపోయింది. కానీ ఈ ఓపినీయన్‌ను మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. హైదరాబాద్ ప్రస్తుతం అన్ని డైరెక్షన్స్‌లో డెవలప్ అవుతోంది. ఈస్ట్, సౌత్, నార్త్ జోన్స్ అన్నీ అభివృద్ధి ట్రాక్ ఎక్కుతున్నాయ్. బోల్డంత ల్యాండ్ బ్యాంక్ ఉండటం.. ఇన్‌ఫ్రా, కమ్యూనికేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ లాంటివి వృద్ధి చెందుతుండటంతో కంపెనీలు ఈ లొకేషన్స్ వైపు దృష్టి పెడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ ఏరియాల్లో రియాల్టీకి డిమాండ్ పెరగడం ఆరంభమైంది. సౌత్, నార్త్, ఈస్ట్ హైదరాబాద్‌ల్లో అందుబాటు ధరల్లో.. మంచి మంచి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయ్. ఇదివరకంటే అమ్మో అంత దూరం ఏం వెళతాంలే అనే భావన వల్ల.. ఈ సైడ్ నిర్మాణ రంగానికి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ, కమ్యూట్ అవడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో డెవలపర్లు, బయ్యర్ల ఫోకసంతా ఇటు మళ్లింది.
- నార్త్ హైద్రాబాద్- కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్- జీడిమెట్ల, సుచిత్ర- జీడిమెట్ల, గాజులరామారం, మేడ్చల్, ఉప్పల్ కలన్
- సౌత్ హైద్రాబాద్- శంషాబాద్, తుక్కుగూడ, రాజేంద్రనగర్
- ఈస్ట్ హైద్రాబాద్- ఆదిభట్ల, చాంద్రాయణ గుట్ట, లక్ష్మిగూడ, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, మన్నెగూడ, పోచారం, శ్రీపురం- బీఎన్ రెడ్డి నగర్, నందిహిల్స్- మీర్‌పేట లొకేషన్స్‌లో 40-45 లక్షల రేంజ్ నుంచే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్. అనేక ప్రాజెక్ట్‌లు సైతం నిర్మాణంలో ఉన్నాయి ఈ ఏరియాల్లో.
వెస్ట్ హైద్రాబాద్- కొల్లూర్, కర్ధనూర్- కొల్లూర్, వెలిమల, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్- తెల్లాపూర్, మోకిల, నల్లగండ్ల- గచ్చిబౌలి, నార్సింగి- కోకాపేట, మంచిరేవుల, అల్కాపురి టౌన్‌షిప్- మణికొండ, నెక్నాంపూర్, పొప్పాలగూడ, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, పీరంచెరు, షేక్‌పేట, అత్తాపూర్ ఏరియాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లోనే కోటి రూపాయల్లోపు బడ్జెట్‌లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయ్.