హైదరాబాద్ కు చెందిన జనరిల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో గ్రూప్ ఏకంగా 600 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన రూ.350 కోట్ల నిధులతో ఈ భూమి సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో నగరంలో జరిగిన అతిపెద్ద భూకొనుగోలులో ఇది కూడా ఒకటి. ఈ భూమి కలిగిన ఉన్న రెండు సంస్థల్లోని మొత్తం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఆ 600 ఎకరాలను సొంతం చేసుకుంది. ‘ఒప్పందం పూర్తయింది. భూమి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉంది. అదే ప్రాంతంలో మరికొంత భూమిని కూడా కంపెనీ సమీకరించింది’ అని ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తి పేర్కొన్నారు. హైదరాబాద్ లో భూమి కొనుగోలు విషయంలో హెటిరో దూకుడుగా వ్యవహరిస్తోందని మరొకరు అభిప్రాయపడ్డారు. 2017లో పురావంకర గ్రూప్ నుంచి రాయదుర్గం ఐటీ బెల్ట్ లో 20 ఎకరాల భూమిని రూ.475 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఒకేసారి 600 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ‘ఆర్ఎంజెడ్ కార్పొరేషన్, కె.రహేజా గ్రూప్ తో హెటిరోకి జాయింట్ డెవలప్ మెంట్ భాగస్వామ్యం ఉంది. హైదరాబాద్ లోని మొత్తం 20 ఎకరాల్లో వాణిజ్యపరమైన ప్రాజెక్టుల అభివృద్ధికి కలిసి పనిచేస్తున్నాయి’ అని ఈ వ్యవహారం గురించి తెలసిన ఒకరు తెలిపారు.