బంజారాహిల్స్ లాంటి ప్రీమియం లొకేషన్‌లో.. బ్యూటీఫుల్ ప్రాజెక్టులో నివసించే అదృష్టం అతి కొద్దిమందికే దక్కుతుంది. మరి, అలాంటి అదృష్టవంతుల జాబితాలో.. ఫార్చ్యూన్ వన్ ప్రాజెక్టు బయ్యర్లు చేరారని శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ చెబుతోంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల నుంచి అనుబంధం ఉంది. బంజారాహిల్స్‌లో అతి శ్రేష్ఠమైన ప్రాజెక్టులో సొగసైన రీతిలో నివసించాలని భావించే అసాధారణమైన వ్యక్తులకు ఈ ప్రాజెక్టు పర్‌ఫెక్టుగా నచ్చిందని సంస్థ చెబుతోంది. వృత్తినిపుణులు, వ్యాపారులు, టాప్ కంపెనీల సీఈవోలు, ఉన్నత ఉద్యోగులు, గ్లామర్ రంగానికి చెందిన ప్రముఖులు.. ఇలా ప్రతిఒక్కర్ని విశేషంగా ఆకర్షిస్తోంది.. ఫార్చ్యూన్ వన్. ఈ సంస్థ ఎక్కడ ప్రాజెక్టు చేపట్టినా, బయ్యర్లు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మించిన స్థాయిలో డెవలప్ చేస్తుందని గుర్తుంచుకోండి.
సుమారు 3.3 ఎకరాల్లో నాలుగు టవర్లలో 174 ఫ్లాట్లను ఇందులో డెవలప్ చేశారు. త్రీ లెవెల్ కార్ పార్కింగ్‌తో పాటు పది అంతస్తుల ఎత్తులో డెవలప్ చేసిన ఈ ప్రాజెక్టులో క్లబ్‌హౌజ్ ను సుమారు 24 వేల ఐదు వందల చదరపు అడుగుల్లో డెవలప్ చేశారు. త్రీ మరియు ఫోర్ బీహెచ్‌కే ఫ్లాట్లు గల ఫార్చ్యూన్ వన్‌లో ప్రతి ఫ్లాటుకు మూడు కారు పార్కింగులను సంస్థ ప్రొవైడ్ చేసింది. మొత్తానికి, హైదరాబాద్‌లో శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్టుల్ని చేపట్టినా.. క్వాలిటీలో కాంప్రమైజ్ కాదనే ఖ్యాతినార్జించింది. అందుకే, ఈ సంస్థ చేపట్టే లగ్జరీ ఫ్లాట్స్, మోడ్రన్ విల్లాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
బంజారాహిల్స్ పోష్ లొకాల్టీలో గేటెడ్ కమ్యూనిటీలో నివసించడమంటే అసాధారణమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే, కేవలం కొద్దిమందికే ఈ అవకాశం దక్కుతుంది. ఫార్చ్యూన్ వన్ ఎంతటి హై సెక్యూర్డ్ ప్రాంతంలో ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఎదురుగా ఉండటం వల్ల సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. అంతేకాదు.. అలా నడుచుకుంటూ కేబీఆర్ పార్కుకు హ్యాపీగా వెళ్లిపొచ్చు.
ఇక్కడ్నుంచి పార్క్ హయత్ హోటల్, పీవీఆర్ సినిమాస్, ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి వంటివి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు. తాజ్ కృష్ణా, జీవీకే మాల్, అపోలో హాస్పిటల్ వంటి వాటికి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, టాప్ స్కూళ్లు, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, పబ్బులు, క్లబ్బులు, కార్పొరేట్ ఆఫీసులు.. ఇలా ప్రతిఒక్కటీ ఈ ప్రాజెక్టుకు చేరువలో ఉండటం విశేషం. మొత్తానికి, బంజారాహిల్స్ నడిబొడ్డున, ఫార్చ్యూన్ వన్ అత్యంత ఉన్నతంగా నిలిచే ఐకానిక్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ అని గుర్తుంచుకోండి.
శ్రీ శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్ ఎక్కడ ప్రాజెక్టును చేపట్టినా నాణ్యతకు పెద్దపీట వేస్తుంది. కాంటెంపరరీ లగ్జరీ ఆర్కిటెక్చర్‌కు ప్రాధాన్యతనిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి జీవనానికి మరియు బిజినెస్ కు డెస్టినేషన్ అయిన బంజారాహిల్స్‌లో.. ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దింది. ఈ క్రమంలో విలాసవంతమైన జీవనాన్ని కోరుకునేవారు ఫార్య్చూన్ వన్‌లో ప్రతిక్షణాన్ని అతిమధురంగా ఆస్వాదిస్తున్నారని చెప్పొచ్చు. ఇందులో సెంట్రల్ కోర్టు యార్డును చూడముచ్చటగా డిజైన్ చేసింది.
ఇందులో నుంచి అడుగు బయటికి వేయకుండానే.. నివాసితులు వాకింగ్, జాగింగ్, స్ట్రెచ్చింగ్ వంటివి చేసుకోవచ్చు. తివాచీపర్చిన పచ్చదనంలో ఎంచక్కా రిలాక్స్ అవ్వొచ్చు. తొమ్మిది, పదో అంతస్తుల్లో తీర్చిదిద్దిన క్లబ్ హౌజ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. టెర్రస్‌లో హ్యాపీగా స్కై వాక్ చేసుకోవచ్చు. అక్కడే స్విమ్మింగ్ పూల్‌లో ఎంచక్కా జలకాలాటలు ఆడుకోవచ్చు. నక్షత్రాల్ని చూసుకుంటూ కుటుంబంతో కలిసి సంతోషంగా డిన్నర్ కూడా చేసుకోవచ్చు.