ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు సమీపంలోని బాచుపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ లో సుమారు 73 ప్లాట్లను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రీ- బిడ్ సమావేశం జరిగింది. ఈ లేఔట్ లో ప్లాట్ల సైజులు 266 నుంచి 487 చదరపు గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రేటు విషయానికి వస్తే.. గజానికి రూ. 25,000లు (అప్ సెట్ ప్రైస్)గా నిర్ణయించారు.
మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి రోడ్డులో పలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ల మధ్య ఈ లేఅవుట్ ఉండటం గమనార్హం. కాకపోతే, వేలంలో పోటీపడి ప్లాట్లు కొనుగోలు చేసే పరిస్థితి అయితే పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే, ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఇంచుమించు ఇదే రేటుకు ప్లాట్లు దొరికే అవకాశముంది. కాకపోతే, హెచ్ఎండీఏ లేఅవుట్ కావడం వల్ల న్యాయపరంగా ఎలాంటి చిక్కులుండవనే ఏకైక ఆలోచనతో కొందరు బయ్యర్లు ప్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశముంది.
This website uses cookies.