Categories: TOP STORIES

ఎపిటోమ్ అనుమతిని హెచ్ఎండీఏ రద్దు చేయాలి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎపిటోమ్ వెంచర్ పలు అక్రమాలకు పాల్పడుతుండటంతో.. దానికిచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు ఇటీవ‌ల హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ లేఖ సారాంశమిదే!
  • ప్రజా అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన నక్ష రోడ్లను పూర్తిగా మూసివేశారు.
  • సహజ వనరులైన కాలువలు, కుంటలు, వర్షం నీరు పోయే దారులను మూసివేశారు.
  • ఎపిటోమ్ భూమికి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఈ వెంచర్ డెవలప్ చేశారు.
  • ఎపిటోమ్ సంస్థ సుమారు 300 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి తీసుకుని 1242 ఎకరాల వెంచర్ గా చూపుతూ.. 1242 ఎకరాల్లో విల్లాల నిర్మాణం అక్రమంగా చేపడుతున్నారు.
  • ఈ ప్రాంతానికి చేరువలో ఉన్న ఇతర రైతుల భూముల్లోకి రైతులు వెళ్లకుండా వారి దారుల్ని పూర్తిగా మూసివేశారు. ఇట్టి విషయంపై ప్రశ్నించిన రైతుల్ని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో బెదిరింపులకు దిగుతున్నారు.
  • ఎపిటోమ్ వెంచర్ అనుమతుల్ని తక్షణమే రద్దు చేసి.. భూములను రీ సర్వే చేయాలని లేకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని చౌటుప్పల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు హెచ్చరించారు.

This website uses cookies.