Categories: LATEST UPDATES

వింటర్లో ఇంటి డెకరేషన్ ఇలా!

శీతాకాలంలో ఇంటిని చిన్న చిన్న మార్పులతో అద్భుతంగా అలంకరించొచ్చు. మరి ఈ చలికాలంలో మీ ఇంటిని అందంగా డెకరేషన్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలివిగో..

  • శీతాకాలం అంటే పగటి పూట కాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల మీ ఇంటిని లైట్ల వెలుగుతో నింపండి. ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో దీపాలను అమర్చండి.
  • వెచ్చదనం కోసం ఫైర్ ప్లేస్ ఏర్పాటు చేసుకోండి. ఇది చలి నుంచి కాపాడటమే కాకుండా మీ ఇంటికి వింటేజ్ లుక్ తీసుకొస్తుంది.
  • సోఫాపై ఉండే కుషన్ కవర్లను అన్నీ ఒకటే కాకుండా వేర్వేరుగా ఉంచుకోండి. దీనివల్ల మీ గదికి కొత్త అందం వస్తుంది.
  • వెచ్చదనం కలిగించే రంగులు ఎంచుకుని వేయించుకోండి.
  • శీతాకాలంలో ఇంటిని అందంగానూ, సౌకర్యవంతంగా ఉంచడంలో రగ్గులది కీలకపాత్ర. రకరకాల రంగులు, షేపులు, టెక్చర్లతో కూడిన రగ్గులు మీ ఇంటికి మరింత వన్నె తెస్తాయి.
  • శీతాకాలంలో బాల్కనీలో కూర్చుని ఎండ వేడిని ఆస్వాదిస్తుంటే వచ్చే ఆ మజానే వేరు. అందువల్ల మీ బాల్కనీని మీరు కూర్చుని ఆహ్లాదంగా గడిపేలా అందంగా డెకరేషన్ చేసుకోండి.
  • కొవ్వొత్తులు ఎప్పుడైనా సరే ఇంటిని అందం తెస్తాయి. అయితే, శీతాకాలంలో ఇవి మరింత బాగుంటాయి. అందువల్ల కొవ్వొత్తులు వెలిగించి అక్కడక్కడా ఉంచండి.

This website uses cookies.