రియల్ ఎస్టేట్ గురుతో నటి నందిని రాయ్
మీ డ్రీమ్ హౌస్ చూసిన తర్వాత మీకు తప్పనిసరిగా ఉల్లాసం మరియు థ్రిల్ కలగాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటేనే అంతరంగంలో ఉత్సాహం కలగాలి. ఆకాశంలో విహరిస్తున్నామనే అనుభూతిని పొందాలని నందిని రాయ్ అంటోంది. రియల్ ఎస్టేట్ గురుతో తన కలల గృహానికి సంబంధించిన ప్రణాళికల్ని పంచుకున్నది.
నందిని రాయ్ తన కలల గృహానికి సంబంధించిన పూర్తి ప్రణాళికల్ని కలిగి ఉందని ఆమెతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఈ ప్రపంచంలో తన దగ్గర మొత్తం డబ్బు ఉంటే, ట్రెండింగ్ గోల్డ్ లీఫ్ పెయింట్‌తో ఆమె తన డ్రీమ్ హౌస్‌ని పూర్తిగా అందంగా తీర్చిదిద్దుకుంటుందని తెలియజేసింది. “నాకు వజ్రాలు మరియు నీలమణి అంటే చాలా ఇష్టం. అందుకే నా ఇంటి తలుపులకు సంబంధించిన నాబ్‌లు విలాసవంతంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటితోనే తయారు చేయిస్తాను. ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న సోఫా అత్యంత ఖరీదైనది. ఇది నిజానికి ఇంటి చక్కదనాన్ని మరింత పెంపొదిస్తుంద”ని వివరించారు.
స్విమ్మింగ్ పూల్ వద్దు..
నందిని రాయ్‌కి పెద్ద మరియు భారీ ప్రదేశాల్ని విపరీతంగా అభిమానిస్తుంది. చిన్న స్థలాలు ఆమెలో ఒకరకమైన భావాన్ని కలిగిస్తుంది. అందుకే, రానున్న రోజుల్లో విలాసవంతమైన గృహాన్ని కొనాలని ప్రయత్నిస్తోంది. తన ఇంటి వెనకా ఖాళీ స్థలంలో జంతువులకు స్థానం కల్పిస్తాను. అవంటే నాకెంతో ప్రేమ కాబట్టి, ఇల్లు లేని జంతువులకు నా ఇల్లు ఎప్పటికీ ఉంటుంది. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదా హోమ్ థియేటర్ రూమ్ అక్కర్లేదనిపిస్తోంది. నేను షూటింగు నుంచి ఎంతో ఒత్తిడితో ఇంటికి వచ్చినప్పుడు.. నా కలల గృహం నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపగలగాలి. అలాంటి ఇంటిని నేను కోరుకుంటాన‘ని చెప్పింది.
సౌండ్ ప్రూఫ్ గది..
బంజారాహిల్స్‌లోని హైదరాబాద్‌లోని అత్యంత వాణిజ్యపరంగా విస్తారమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆమెకు రెండు విశాలమైన హాళ్లు & సమావేశాల కోసం సౌండ్‌ప్రూఫ్ గది వంటివి ఉన్నాయి. తను కొత్త కలల గృహంలో సౌండ్‌ప్రూఫ్ గదులు ఉండాలని కోరుకుంటోంది. సువాసనలు వెదజల్లే చామంతి అంటే అత్యంత ఇష్టం. అందుకే రోజు విడిచి రోజు వాటిని ఇంట్లో తప్పకుండా ఉంచుతుంది. “నా కలల గృహం ఈ దేశంలో మాత్రమే ఉంటుంది. ఇటీవల జమ్మూ మరియు మనాలి సందర్శించాను. నాకు ముందునుంచీ పర్వతాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంటిని అక్కడే నిర్మించుకోవాలని చూస్తున్నాను. ఎందుకంటే, బీచ్‌ల కంటే నాకు పర్వతాలంటేనే నచ్చుతాయి. నేను కాశ్మీర్ లోయలో ఒక కలప గృహాన్ని కొనుక్కోవాలని ఉంది. అక్కడే చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు రంగురంగుల పువ్వులుంటే కలిగి ఆనందమే వేరు. పైగా, నా చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదని కోరుకుంటున్నాను.
మణికొండ దారుణం..
ఏ ఇల్లు అయినా సానుకూలతను పెంపొందించాలి. విశ్రాంతి పొందేలా ఉండాలి. కలల గృహం ఎప్పుడూ ఉత్సాహపరిచే విధంగా ఉండాలన్నది ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నమ్మకం. ఆమెకు ‘వాస్తు’ గురించి పూర్తి జ్ఞానం కూడా ఉంది, ఆమె దాన్ని నమ్ముతుంది కూడా. “మీ కలల ఇల్లు ఎప్పుడూ అనుకోకుండా కొనుగోలు చేయకూడదు! ప్రతి కుటుంబ సభ్యుడి ఆలోచనలకు తగ్గట్టుగా ఇంటిని ప్లాన్ చేసుకోవాలి. సరైన స్థలంలో ఇల్లు కొనుగోలు చేయాలి. లేకపోతే తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. నా ఇంటి చుట్టూ చెడు వాసన మరియు చెత్త ఉంటే నేను సహించను. హైదరాబాద్‌లో మణికొండ వంటి ప్రాంతంలో మురుగునీరు రోడ్డు మీదే ప్రవహించడం చూశాను. అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది. వంట గదిలోనే లక్ష్మీ ఉంటుందని అంటారు. అలాంటప్పుడు వంట గదిని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఎక్కడైతే వంట గది పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీ దేవి నివాసమేర్పాటు చేసుకుంటుంది.”