Categories: AREA PROFILE

గోపన్ పల్లిలో.. హానర్ అక్వాంటిస్

గచ్చిబౌలి సమీపంలో కొత్తగా నిర్మించిన 2 బీహెచ్ కే లేదా 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్ కోసం చూస్తున్నారా? అయితే, హానర్ హోమ్స్ నిర్మించిన హానర్ అక్వాంటిస్ మీ అన్వేషణకు ముగింపు పలుకుతుంది. సమకాలీన నిర్మాణశైలితో నిర్మితమైన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సౌకర్యవంతమైన జీవన విధానానికి సరైన చిరునామా అని చెప్పడం అతిశయోక్తి కాదు.

రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు10.5 ఎకరాల స్థలంలో ఉంది. మొత్తం ఏరియాలో 81 శాతం ఓపెన్ స్పేస్ కావడం వల్ల గాలీ వెలుతురుకు ఢోకా ఉండదు. మొత్తం ఆరు టవర్లు.. ఒక్కో టవర్లో 30 అంతస్తులు.. మెరుగైన జీవనం కోసం 20 సౌకర్యాలు.. ఇవీ హానర్ అక్వాంటిస్ ప్రత్యేకతలు. గచ్చిబౌలి సమీపంలోని గోపన్ పల్లిలో ఉన్న ఈ ప్రాజెక్టు.. లోకేషన్ పరంగా కూడా చక్కని ఏరియా కావడం విశేషం. చుట్టూ పచ్చదనం.. కావాల్సినంత ఓపెన్ స్పేస్ ఉండటం వల్ల ప్రాజెక్టులోకి ప్రవేశించగానే ప్రకృతి వనంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. దీనికి తోడు ప్రవేశమార్గం వద్ద వాటర్ ఫీచర్ మనకు స్వాగతం పలుకుతుంది. చక్కగా నిర్మించిన పాత్ వేలు మనసుకు హత్తుకుంటాయి.

పర్యవరణ అనుకూల ప్రమాణాలకు కట్టుబడి నిర్మించినందున ఈ ప్రాజెక్టుకు ఐజీబీసీ ప్రి సర్టిఫైడ్ గ్రీన్ రేటింగ్ కూడా ఇచ్చింది. 50వేల చదరపు అడుగుల్లో నిర్మించిన క్లబ్ హౌస్ మరో ఆకర్షణ. జిమ్ లో కసరత్తు చేయడానికి, స్విమింగ్ పూల్ లో సేద తీరడానికి క్లబ్ హౌస్ లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి.

This website uses cookies.