దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు పెరుగుతన్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ అందరి కంటే ముందుంది. దేశంలోని ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల దాదాపు 10 శాతంగా ఉండగా.. హైదరాబాద్ లో ఇది 19 శాతం కావడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 19 శాతం పెరిగినట్టు క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. మన భాగ్యనగరంలో సగటున చదరపు అడుగు ధర రూ.11,040కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల అత్యధికంగా (19 శాతం) హైదరాబాద్‌లోనే నమోదైంది.
ఆ తర్వాత బెంగళూరులో ధరల పెరుగుదల 18 శాతంగా ఉంది. అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర 9 శాతం పెరిగి రూ.6,613గా ఉంది. బెంగళూరులో క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చిచూస్తే ఇళ్ల ధర చదరపు అడుగునకు 18 శాతం పెరిగి రూ.9,471గా ఉంది. చెన్నైలో 7 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.7,712కు చేరుకుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధర 12 శాతం పెరిగి చదరపు అడుగు రూ.8,655గా ఉంది. కోల్‌కతా మార్కెట్లో 12 శాతం పెరిగి రూ.7,406కు చేరగా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో చదరపు అడుగు ధర ఒక శాతం వృద్ధితో రూ.19,585కు చేరింది. పుణెలో 12 శాతం పెరిగి రూ.9,014గా ఉంది.
This website uses cookies.