Categories: LATEST UPDATES

భారత్ వైపు గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు

  • పెట్టుబడులకు అనువుగా ఉండటంతో
    భారత్ రియల్ రంగంపై ఆసక్తి

భారతదేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రపంచ పెట్టుబడిదారులకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. మన ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, మెరుగైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో బలమైన డిమాండ్‌ కారణంగా ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌లలో భారతదేశం ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే గ్లోబల్‌ ఇన్వెస్టర్లు భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారని కొల్లియర్స్‌ ఏపీఏసీ ట్రెండ్స్‌ ఇన్వెస్టర్‌ ఔట్‌లుక్‌ 2023 నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌ పట్ల గ్లోబల్‌ ఇన్వెస్టర్లు, ఏపీఏసీ ఎంతో ఆశావహ ధృక్పథంతో ఉన్నారని, ఇండియన్‌ మార్కెట్‌ ఆకర్షణీయమైన ధర, మెరుగైన విలువలు స్థిరమైన రాబడిని అందించటమే ఇందుకు కారణమని పేర్కొంది. 2023 సంవత్సరానికి గానూ మొదటి తొమ్మిది నెలల్లో రియల్‌ ఎస్టేట్‌లో సంస్థాగత పెట్టుబడులు సంవత్సరానికి 27 శాతం పెరిగిందిని వెల్లడించింది.

2018 నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టర్లు తమ కంపెనీలో 23 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టారని, మొత్తం పెట్టుబడులలో 77 శాతం వాటాను కలిగి ఉన్నారని కొలియర్స్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ మరియు రీసెర్చ్‌ హెడ్‌ విమల్‌ నాడార్‌ తెలిపారు. 2023 సంవత్సరానికి గానూ కార్యాలయ ఆస్తులలో సంస్థాగత పెట్టుబడులు సంవత్సరానికి 1.6 రెట్లు పెరిగి 2.9 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ సంవత్సరం తొమ్మిది నెలల మొత్తం ఇన్ ఫ్లోలో ఇది 63 శాతం.

భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుందని, రాబోయే త్రైమాసికాల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని నాడార్‌ చెప్పారు. విదేశీ పెట్టుబడుల ఇన్ ఫ్లోలో 44 శాతం వాటాతో అమెరికా అగ్రశ్రేణి పెట్టుబడిదారుగా కొనసాగుతోందని.. కెనడా, ఏపీఏసీ 25 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నాడార్‌ పేర్కొన్నారు. అలాగే గుర్తింపు పొందిన మార్కెట్లు స్థిరమైన వృద్ధి చూపుతుండటం వల్ల పెట్టుబడిదారులు తమ వ్యాపారావశాలను విస్తరించుకోగలమనే గట్టి నమ్మకం కనబరుస్తున్నారని భారతదేశంలో ఆఫీస్, లాజిస్టిక్స్, ప్రైవేట్‌ క్రెడిట్, రెసిడెన్షియల్‌ మరియు డేటా సెంటర్స్‌ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని క్యాపిటల్‌ మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీయూష్‌ గుప్తా అన్నారు.

ఆఫీస్‌ స్పేస్‌యే మొదటి ఎంపిక

సంస్థాగత పెట్టుబడిదారులు, పెరిగిన అవకాశాలు, స్థితిస్థాపకమైన డిమాండ్, అభివృధ్దికి అనువైన అవకాశాలతోపాటు ఆర్‌ఈఐటీ రూపంలో నిష్క్రమణ మార్గాల లభ్యతలో భారతదేశంలో ఆఫీస్‌ స్పేస్‌ విభాగానికి ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. అలాగే భారతదేశం డేటా సెంటర్‌ గమ్యస్థానంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మూడేళ్లలో 10 బిలియన్ల పెట్టుబడులకు అవకాశముందని అంచనా. స్థిరమైన ఆదాయం, అధిక ఫలితాల కారణంగా సంస్థాగత పెట్టుబడిదారులు భారతదేశం యొక్క డేటా సెంటర్‌ల వృద్ధి కోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెడుతున్నారు.

2020 నుంచి ఈ పెట్టుబడులు 1.1 బిలియన్లకు చేరుకున్నాయి. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఎంటీటీ లీడ్‌ డీల్స్ లో అధిక భాగస్వామ్యంతో నిధుల కార్యకలాపాలపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, దేశీయ పెట్టుబడిదారులు కూడా మార్కెట్లో మరింత చురుకుగా మారారు. పనితీరు క్రెడిట్, ప్రత్యేక పరిస్థితులు, పోర్ట్ ఫోలియో సముపార్జనలు, ఆస్తుల పునర్నిర్మాణం మరియు సంబంధిత నిర్మాణాలు పెరుగుతున్నాయి. ‘విదేశీ ఇన్వెస్టర్లు ఏ పెద్ద మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టవచ్చో పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి ఆఫీస్‌ మరియు లాజిస్టిక్స్‌ రంగాలలో భారతదేశం ఈ విషయంలో నికర గ్రహీతగా నిలుస్తోంది. కెనడా, సింగపూర్‌ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మనదేశం సంస్థాగత మార్కెట్‌గా మారింది, ’’అని ఆసియా పసిఫిక్‌ గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్‌ పిల్‌గ్రిమ్‌ అన్నారు.

This website uses cookies.