poulomi avante poulomi avante

విశాఖలో రియల్ మార్కెట్ ఎలా ఉంది?

విశాఖపట్నం.. ఏపీలో కీలక నగరం. ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన ప్రాంతం. మరి అక్కడ రియల్ ముఖచిత్రం ఎలా ఉంది? ఎలాంటి అనువైన వాతావరణం ఉందో చూద్దామా? పారిశ్రామిక, ఐటీ రంగం, కాస్మోపాలిటన్ సంస్కృతి కారణంగా ఉత్తరాంధ్ర ప్రముఖ రెసిడెన్షియల్ మార్కెట్ గా విశాఖ ప్రసిద్ధికెక్కింది. అక్కడ అపార్ట్ మెంట్ సగటున చదరపు అడుగుకు రూ.4,950గా ఉంది.

ప్రైమ్ ఏరియా..

ఎంవీపీ కాలనీ, సిరిపురం, సీతమ్మధార, పెద్ద వాల్తేరు ప్రాంతాలు ప్రైమ్ ఏరియా కేటగిరీలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండటం, భూ లభ్యత తక్కువగా ఉండటంతో ధరలు చాలా ఎక్కువ.

సౌత్ వెస్ట్..

గాజువాక, దువ్వాడ, అచ్యుతాపురం, పర్వాడ తదితర ప్రాంతాలు సౌత్ వెస్ట్ పరిధిలో ఉంటాయి. ప్రధానంగా ఇది పారిశ్రామిక ప్రాంతం. ప్రస్తుతం గాజువాక ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాంతంగా మారుతోంది.

నార్త్..

రుషికొండ, ఎందాడ, మధురవాడ ప్రాంతాలు నగరం ఉత్తర పరిధిలోకి వస్తాయి. ఐటీ హబ్ కు కేంద్రంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని ప్రధాన రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలు ఇక్కడ వస్తున్నాయి.

వెస్ట్..

ఎన్ఏడీ, గోపాలపురం, వేపగుంట ప్రాంతాలు పశ్చిమ పరిధిలో ఉంటాయి. పెందుర్తితో ఎన్ఏడీని అనుసంధానం చేసే ప్రధాన రహదారి వెంబడి అభివృద్ధి జరుగుతోంది. సరసమైన ధర నుంచి మధ్య తరహా ఇళ్ల సెగ్మెంట్ కు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

2.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్..

వాణిజ్యపరంగా చూస్తే సిరిపురం, వాల్తేర్ రోడ్డు, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, మద్దెలపాలెం వంటివి ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ ప్రాంతాలు. ఇక్కడ 2.2 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ ఉంది. ఇందులో ఎక్కువ భాగం మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్ లతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రైమ్ ఆఫీస్ మార్కెట్ లో లీజు చదరపు అడుగుకు రూ.50 నుంచి రూ.55 వరకు ఉంది. రుషికొండ, మధురవాడ ప్రాంతాల్లో చదరపు అడుగుకు రూ.40 నుంచి రూ.50 వరకు ఉంది.

రిటైల్ పరిస్థితి ఇదీ..

రిటైల్ బ్రాండ్లకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా విశాఖ అవతరించింది. వీఐపీ రోడ్, వాల్తేర్ రోడ్, సంపత్ వినాయక్ రోడ్, సిరిపురం వంటివి ప్రముఖ హై స్ట్రీట్ ప్రాంతాలు. స్టార్ బక్స్, మ్యాక్స్, లైఫ్ స్టైల్, సెంట్రల్ వంటి ప్రముఖ రిటైల్ బ్రాండ్లు ఇప్పటికే విశాఖలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. అద్దెల విషయానికొస్తే.. వీఐపీ రోడ్, వాల్తేర్ రోడ్, సంపత్ వినాయక్ రోడ్, సిరిపురంలలో చదరపు అడుగుకు రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. ద్వారకా నగర్, డాబా గార్డెన్, అచ్యుతాపురం, పర్వాడ తదితర ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.140 మధ్య ఉండగా.. గాజువాకలో రూ.100 నుంచి రూ.120 వరకు ఉంది. ఎంవీపీ కాలనీ, మురళీ నగర్ లలో రూ.80 నుంచి రూ.100 వరకు ఉంది.

త్వరలో రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖకు పెద్ద గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇది లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను, రియల్ ఎస్టేట్ బూమ్ ను పెంచుతుంది. మధురవాడ, కాపులుప్పాడలో అదానీ గ్రూప్ చేపట్టిన రాబోయే ఇంటెగ్రేటెడ్ డేటా సెంటర్, బిజినెస్ పార్క్ లు ఇతర కీలక కంపెనీలను ఆకర్షించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ రియల్ రంగం బాగా వృద్ధి చెందుతుంది. రెన్యువబుల్ ఎనర్జీ, టెక్స్ టైల్స్ అండ్ అపెరల్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాబోతున్న మౌలిక వసతులు ఇవే..

  •  విశాఖపట్నం భోగాపురం ఆరు లేన్ల బీచ్ కారిడార్. దీనిని భోగాపురంలోని విశాఖ పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా రూ.1020 కోట్లతో చేపట్టనున్నారు. దీని వల్ల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అంతే కాకుండా బీచ్ ఫ్రంట్స్, రిసార్టులు, హోటళ్లు, ఎంఐసీ కన్వెన్షన్ సెంటర్ల వంటి పర్యాటక వసతులు పెరుగుతాయి.
  •  గ్రీన్ ఫీల్డ్ రాయ్ పూర్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ వే. 464 కిలోమీటర్ల రాయ్ పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ను రూ.20వేల కోట్లతో చేపట్టనున్నారు. 2025 నాటికి ఇది పూర్తి కానుంది.

విశాఖ విశేషాలివీ..

  • విశాఖపట్నాన్ని వైజాగ్ అని కూడా అంటారు. ఇది పోర్ట్ సిటీ. పారిశ్రామిక హబ్, ఏపీలో అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరం.
  • ఆర్ఐఎన్ఎల్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ వంటివి ఇక్కడ ఉన్నాయి.
  •  ఇక్కడి గంగవరం సీ పోర్ట్.. దేశంలోని లోతైన ఓడరేవులలో ఒకటి.
  •  ఏపీ విద్యా కేంద్రంగా విశాఖ భాసిల్లుతోంది. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు ఐఐఎం, ఐఐఎఫ్టీ, గీతం వర్సిటీ వంటివి ఉన్నాయి.
  •  విశాఖ నగర జనాభా 23.5 లక్షలు. వార్షిక తలసరి ఆదాయం రూ.2.44 లక్షలు. అక్షరాస్యత 81.79 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 87.25 శాతం ఉండగా.. స్త్రీల అక్షరాస్యత 76.22 శాతం. ఉద్యోగ రేటు 68 శాతం.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles