- అసలు వసూలు చేస్తారా? లేదా?
జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ పరిధిలో న్యాయపరంగా ఎలాంటి వివాదాల్లేని భూముల్లో.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తే.. రెరా జరిమానాను లెక్కించడానికి సులువుగా ఉంటుంది. మరి, సుప్రీం కోర్టులో వివాదంలో ఉన్న భూమిలో.. అనుమతులే రాని ప్రాంతంలో.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తుంటే.. ఆయా నిర్మాణ సంస్థ నుంచి జరిమానా ఎలా లెక్కిస్తారు? ఎప్పుడు వసూలు చేస్తారు? అసలు వసూలు చేస్తారా? లేదా?
టీఎస్ రెరా ఏర్పాటైన తొలి రోజుల్లో కొన్ని సంస్థల నుంచి రెరా జరిమానా వసూలు చేసింది. కొన్ని సంస్థలకు నోటీసుల్ని కూడా జారీ చేసింది. కాకపోతే, ఆతర్వాత నోటీసులేమయ్యాయో ఎవరికీ తెలిసేది కాదు. మరి, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే విధంగా, ప్రీలాంచ్ సంస్థలకు నోటీసులిచ్చి టీఎస్ రెరా అథారిటీ చేతులు దులిపేసుకుంటుందా? లేక నిజంగానే జరిమానా వసూలు చేస్తుందా? అనేది త్వరలో తెలుస్తుంది. వాస్తవానికి, బిల్డాక్స్ సంస్థ ఇప్పటికే పులువురు ఛానెల్ పార్ట్‌నర్ల ద్వారా.. అధిక సంఖ్యలో ఫ్లాట్లను విక్రయించిందని సమాచారం. కేవలం ప్రీలాంచ్ అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ కనీసం రెండు వందల కోట్లను వసూలు చేసిందని మార్కెట్లో టాక్. ఈ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తే.. మరికొంత మంది అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేసే ప్రమాదముంది. కాబట్టి, టీఎస్ రెరా బిల్డాక్స్ వంటి సంస్థల నుంచి ముక్కుపిండి జరిమానాను వసూలు చేయాల్సిందే.