poulomi avante poulomi avante

ఆర్థిక మాంద్యంలో.. అమ్మకాల్ని పెంచడమెలా?

బిల్డర్ అనే పదానికి ఇండియాలో నిర్మించేవారని అర్థం. కానీ పాశ్చాత్త దేశాల్లో బిల్డర్లు అంటే ఎంట్ర‌ప్రెన్యూర్ అనే మ‌రో అర్థ‌ముంది. నిజానికి రియల్ బిల్డర్లు ఎంట్ర‌ప్రెన్యూర్ల‌ కంటే ఎక్కువని గుర్తుంచుకోండి. భవిష్యత్తును నిర్మించే వారందరూ బిల్డర్లే అవుతారు. నా దృష్టిలో ఒక వ్యవస్థను, గొప్ప బృందాన్ని, గొప్ప సంస్థాగత సంస్కృతిని, మెరుగైన – శ్రేష్ఠమైన జీవితాలను అందించే సమాజాలను నిర్మించేవారని అర్ధం. ఒక్క మాటలో చెప్పాలంటే “బిల్డర్” అంటే బిల్డింగ్ లు కట్టేవారు కాదు, కమ్యూనిటీల‌ను నిర్మించేవార‌ని అర్థం. నిర్మించేవారు. నిర్మాణ రంగం మనిషి ప్రాధమిక అవసరాలైన‌ మొదటి మూడులో ఉంది కనుక కస్టమర్ సెగ్మెంట్ ను బట్టి వారి అవసరాలకు మించిన విలువను – సరైన ధరకు అందించగలిగితే కస్టమర్ అభిమానులుగా మారిపోతారు.

మార్కెట్ బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు. మార్కెట్ నెమ్మ‌దించినప్పుడే “కమ్యూనిటీ బిల్డర్ మైండ్ సెట్” లేని వారు.. నీరులేని చెరువులో చేపలు తేలినట్లుగా తేలిపోతుంటారు. ఎవరికైనా ఆశయం బదులు ఆశ ఎక్కువైనప్పుడు మార్కెట్లో మాంద్యం వస్తుంది. మైంట్ సెట్‌ మార్చుకోవడం ద్వారా ఏ సమస్యను అయినా అవకాశంగా మార్చుకునే వారే ‘రియల్ బిల్డర్ గా అవ‌త‌రిస్తార‌ని మ‌ర్చిపోవ‌ద్దు. గత మూడు సంవత్సరాలుగా కొవిడ్‌, ఆ తరువాత ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ఆర్ధిక మాంద్యం.. అంతకు మించి 69 దేశాల్లో ఆహార సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించడం.. ధరల పెరుగుదల వంటివి మధ్య తరగతి ప్ర‌జ‌ల్లో అలజడిని సృష్టించింది. ఫ‌లితంగా మాన‌సిక ఒత్తిడికి దారి తీసింది. ఈ సమయంలో భారతీయులకు ఒకప్పుడు ఉండే పొదుపు అలవాటు తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది మార్కెట్ కు మంచిదే అయినా కస్టమర్ కు ఛాయస్ లు పెరిగిపోతుంటాయి. ఈ సమయంలో ఆశకు-అత్యాశకు పోకుండా అవసరాన్ని తీర్చే ఉద్దేశ్యంలో ఉన్నవారే నిలబడతారు.

సృజ‌నాత్మ‌క కీల‌కం..

ఏ బిజినెస్ ఓనర్ అయినా క్యాష్ ఫ్లో తగ్గేటప్పటికి ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తో పాటు క్రియేటివ్ ఐడియాస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. దీంతో భవిష్యత్తు పట్ల ఆందోళన పెరుగుతుంది, తద్వారా సృజనాత్మకత, ఆవిష్కరణ ఆగిపోతుంది. క్రమంగా ‘రెడ్ – ఓషన్’ అంటే అత్యంత పోటీ ఉన్న రద్దీ కమోడిటీ మార్కెట్ లో ప్రవేశిస్తారు. అంటే వీరు వందలో ఒక్కరిగా ఉండే ప్రాజెక్ట్ నుండి మందలో ఒక్కరుగా మారిపోతారు. ఇలాంటప్పుడే బ్లూ ఓషన్‌ (వినూత్న) మార్కెట్ కొత్త ఆవిష్కర్తల కోసం ద్వారాలు తెరుస్తూ ఉంటుంది.

ఏ బిల్డర్ అయినా మూడు పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు సృష్టికర్త , లీడర్స్ ను అభివృద్ధి చేసే లీడర్, మేనేజ్మెంట్ (డైలీ ఆపరేషన్స్). ఒక సదుద్దేశంతో ఒక మంచి కమ్యూనిటీ నిర్మించాలని అనుకునే బిల్డర్లు.. మార్కెట్లోకి వెళ్లే ముందు మార్కెట్ పోక‌డ‌లు అర్ధమైతే ఆ ప్రాజెక్టు థీమ్ కు సరిపడే మైండ్ సెట్‌ ఉన్న వారితో టీం నిర్మించగలుగుతారు. సరైన టీం సరైన కస్టమర్ల‌కు అర్ధమయ్యే విధంగా వివరించి – ఒక మంచి కమ్యూనిటీ ఏర్పడటానికి సహాయపడగలుగుతారు.

బిజినెస్ స‌మావేశాలు ముఖ్యం..

మార్కెట్ ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి రియాక్ట్ మైండ్ కాకుండా అడాప్టివ్ (అనుకూలంగా) మైండ్ సెట్ తో సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారితో సత్సంగం చేస్తే లేదా అటువంటి స‌మావేశాలు, స‌ద‌స్సుల్లో హాజ‌రైతే మదిలో కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. కానీ మార్కెట్ బాగున్నప్పుడు న‌గ‌దు లెక్కపెట్టుకోవడానికే సమయం ఉండదు, మార్కెట్ తగ్గితే తమ బాధలు తోటి బిల్డర్ తో చెప్పుకోవడం వలన లాభ‌ముండ‌దు. ఇలాంటి సమయంలో ఒక బిజినెస్ కోచ్ / మార్కెటింగ్ కన్సల్టెంట్ / బిజినెస్ గ్రోత్ స‌మావేశాలు వంటి ప్రో యాక్టివ్‌ చర్యల వలన కొత్త ఆలోచ‌న‌లు పుట్టుకొస్తాయి.

కొంతమంది బిల్డర్లు మార్కెట్ మంద‌గించినా ఆనందంగా ఉన్నారు. గత ఒకటి రెండు సంవత్సరాలుగా లాభాలు ఆర్జించ‌డం వల్ల ప్ర‌స్తుతం ప్రశాంతంగా కడుతున్నారు. స్థలం చేతిలో లేకుండా, సరైన అగ్రిమెంట్లు లేకుండా, అనుమతులు లేకుండా గాలి మేడలు కట్టినవారు ఇబ్బంది పడతారు. మార్కెట్ మెరుగ్గా ఉన్నప్పుడు ఏ మార్కెట్ స్ట్రాటజీ అయినా పని చేస్తున్నట్లే ఉంటుంది. తేడా వచ్చినప్పుడు ఏ వ్యూహం పని చేయనట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో సాధికారికమైన బిల్డర్లు.. ఒక్క ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తారు, తమ విజ‌న్ ని నిజం చేసుకోవడానికి కృషి చేస్తారు.
బిల్డింగ్ కట్టామా – నాలుగు డబ్బులు మిగిలాయా అని ఆలోచించేవారు బిజినెస్ ఓనర్లు అవుతారు. ఒక సామాజిక బాధ్య‌త‌ ఉన్న అవసరాన్ని తీర్చడం – లేదా ఒక సంపద సృష్టించే ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టును ఒక య‌జ్ఞంలా ప‌ని చేసి నిజం చేయగలిగినవారు ఒక బ్రాండ్ గా ఎదిగిపోతారు. క‌రోనా తరువాత మనుష్యుల ఆలోచనల్లో ఆరోగ్యం – ఆనందం వైపు ఆలోచనలు మళ్లడం శుభసూచకం. ఏ ట్రెండ్ అయినా కాష్ చేసుకోవడానికి సరైన సంస్థలతో పాటు – ఫేక్ సంస్థలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఈ ఫేక్ సంస్థలు అమ్మగలుగుతారు – నిర్మించలేరు. ఇటువంటి వారి వలనే విశ్వసనీయత లోపం (Trust Deficit ) ఏర్పడింది. ధర ఎక్కువయినా స‌రైన గత చరిత్ర ఉన్న బ్రాండ్ ను మాత్రమే నమ్మడానికి కారణం.. చాలామంది బిల్డర్ల‌కు ఒక సంస్థను నిర్మించే విజ‌న్‌ లేకపోవడం, ఆ దిశగా ఆలోచించకపోవడంమే కార‌ణాల‌ని చెప్పొచ్చు. నిబద్ధత-సమర్ధత కల సాధికారిక సంస్థలకు మాంద్యం సమయం సువర్ణావకాశం. ఈ సమయంలో న‌మ్మ‌కం అనేది తమ చేతల ద్వారా చూపించగలిగే వారికి కస్టమర్ ఫ్రీ మార్కెటింగ్ చేసి పెడతాడు. మార్కెట్ బ్రహ్మరథం పట్టడం అంటే ఇదే!

మార్కెట్ మెరుగ్గా ఉన్న‌ప్పుడు చాలామంది బిల్డ‌ర్ల‌కు న‌గ‌దు లెక్కపెట్టుకోవడానికే సమయం ఉండదు, అమ్మ‌కాలు త‌గ్గితే తమ బాధలు తోటి బిల్డర్ల‌తో చెప్పుకోవడం వలన లాభ‌ముండ‌దు. ఇలాంటి సమయంలోనే ఒక బిజినెస్ కోచ్ అత్య‌వ‌స‌ర‌మ‌ని గుర్తుంచుకోవాలి. బిజినెస్ గ్రోత్ స‌మావేశాల‌కు హాజ‌రైతే కొత్త ఆలోచ‌న‌లు పుట్టుకొస్తాయి. ఫలితంగా అమ్మ‌కాల్ని పెంచుకునే వీలు క‌లుగుతుంది.

వేణు భగవాన్,
బిజినెస్ కోచ్,
వీబీ ప్రాస్ప‌రిటీ.
9603939239

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles