-
వేదిక: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం
-
ముఖ్య అతిథి: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలకేం కావాలో ప్రభుత్వానికి తెలుసు. ప్రజలూ సురక్షితమైన వాతావరణంలో పరిశుభ్రంగా జీవించాలని ఆశిస్తున్నారు. అందుకే, గత రెండేళ్ల నుంచి మౌలిక సదుపాయల ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా, హైదరాబాద్‌లో రియల్ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి ఫలాల్ని అందుకుంటున్న ప్రజలు.. సొంతింట్లో నివసించాలన్న వారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు.. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అడుగు ముందుకేసింది. తెలంగాణ ప్రాపర్టీ ఎక్స్‌పో ఈస్ట్ పేరిట నేడు, రేపు ప్రత్యేకంగా ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేస్తారు. నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ ప్రణాళికల్ని వివరించే అవకాశముంది. మొత్తానికి, తెలంగాణ నిర్మాణ రంగమంతా ఆయన రాక కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తోంది.
హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారి కోసం అవసరమయ్యే అపార్టుమెంట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ప్రాపర్టీ షోలో లభిస్తుంది. అదేవిధంగా, భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాల్లో ప్లాట్ల వివరాలు దొరుకుతాయి. ఆధునిక విల్లాలతో పాటు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టాలని భావించేవారికి పూర్తి సమాచారం లభిస్తుంది. ఈ ప్రాపర్టీ షోకు పల్లాడియం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది.
ప్లాటినం స్పాన్సర్లుగా టీఎన్ఆర్ గ్రూప్, ఎన్ఎస్ఎల్ ఇన్ ఫ్రా టెక్, డైమండ్ స్పాన్సర్లుగా మారుతీ రుద్ర కన్ స్ట్రక్షన్స్, రాంకీ ఎస్టేట్స్ ఆష్వీ, విజేత.. గోల్డ్ స్పానర్లుగా.. మారమ్, నమిష్రి, ఏవీ కన్ స్ట్రక్షన్స్, సూపర్ హోమ్స్, జేఎస్సార్ గ్రూప్ సన్ సిటీ, కోన్, జేబీ ఇన్ ఫ్రా గ్రూప్, సాహస్రం డెవలపర్స్, జుబిలీ ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వంటి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. వేకా, డీఈసీ ఇండస్ట్రీస్, సిల్వర్ స్పాన్సర్లుగా.. ఏస్, ఎస్వీఎస్, హైరైజ్, క్వారిజన్ నిర్మాణ్, నవ్య డెవలపర్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఎల్ఐసీ, హ్యావెల్స్, గ్రీన్ లీవ్స్ ఇన్ ఫ్రా, జి స్క్వేర్, ఆర్వీ నిర్మాణ్ వంటివి ప్రీమియం స్పానర్లుగా ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి.