poulomi avante poulomi avante

హోమ్ లోన్ తగ్గించుకునేదెలా?

ఇంటి కొనుగోలులో రుణానిదే కీలకపాత్ర. జీవితంలో ప్రతి ఒక్కరూ పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇంటిపైనే. సొంతింటి కల సాకారం చేసుకోవడానికి గృహరుణం తీసుకోవడం తప్పదు. నాలుగైదేళ్ల క్రితం 6.35 శాతం వార్షిక రేటుతో ఇంటి రుణం లభించే పరిస్థితి ఉండగా.. ఆర్బీఐ కీలక రేట్ల పెంపు ఫలితంగా అది 9.5 నుంచి 10 శాతానికి పెరిగిపోయింది. దీంతో ఆ మేరకు ఈఎంఐలు కూడా పెరిగాయి. దాదాపు అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. దీంతో నెలవారీ ఈఎంఐ భారం పెరిగింది. మరి దీనిని ఎలా తగ్గించుకోవచ్చు? ఇందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దామా?

హోమ్ లోన్ ట్రాన్స్ ఫర్..

మీరు రుణం తీసుకున్న వడ్డీ రేటు ఎంత ఉంది? ఇతర బ్యాంకులు ఎలా వసూలు చేస్తున్నాయో పరిశీలించాలి. మీరు చెల్లిస్తున్న వడ్డీ కంటే ఇతర బ్యాంకుల్లో ఎక్కడైనా తక్కువ వడ్డీ రేటు ఉంటే మీ గృహ రుణాన్ని ఆ బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. అయితే, ఇందుకు ఏమైనా చార్జీలు ఉన్నాయా? రుణ బదిలీ వల్ల మనకు కలిగే ప్రయోజనం ఎంత వంటి అంశాలను బేరీజు వేసుకుని ముందుకెళ్లాలి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ప్రాసిసింగ్ ఫీజు తగ్గించడమో అసలు తీసుకోకుండా ప్రాసెస్ చేయడమో జరుగుతోంది. వీటిని పరిశీలించాలి.  ప్రస్తుతం గృహ రుణంపై ఫిక్స్ డ్, ఫ్లోటింగ్‌ రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్‌ రేటు రుణాలు ఆర్‌బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్ డ్ రేట్‌ విధానంలో నిర్ణీత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలతో పోలిస్తే ఫిక్స్‌డ్‌ రేట్‌ రుణాలపై వడ్డీ రేటు 1.5-2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్‌ రేట్‌ విధానంలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5-10 శాతం వసూలు చేస్తున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు 10.5 శాతం వరకు చార్జ్‌ చేస్తున్నాయి. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్‌ స్కోర్‌ తదితర అంశాలను బట్టి ఈ రేటులో కాస్త తేడా ఉంటుంది.

ఈఎంఐ పెంపు.. కాలవ్యవధి పెంపు.. ఏది బెస్ట్?

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కొన్ని బ్యాంకులు ఈఎంఐ పెంచడానికి బదులు రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, మనం కట్టే మొత్తం మాత్రం దీర్ఘకాలంలో ఎక్కువే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుత బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్‌ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకుని తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles