Categories: TOP STORIES

జీహెచ్ఎంసీలో భారీగా హైరైజ్ టవర్లు

  • 30 అంతస్తుల పైబడిన 14 భవనాలకు అనుమతి
  • 2022లో భవన అనుమతుల ద్వారా
    జీహెచ్ఎంసీకి రూ.1056 కోట్ల ఆదాయం

రియల్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో భారీగా హైరైజ్ టవర్లు రానున్నాయి. 2022లో మొత్తం 60 హైరైజ్ రెసిడెన్షియల్, 22 హైరైజ్ కమర్షియల్ భవనాలకు 16 లేఔట్ గేటెడ్ కమ్యూనిటీలకు జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఇందులో 30 అంతస్తుల పైబడిన భవనాలు 14 ఉండటం విశేషం. మిగిలినవి 10 నుంచి 30 అంతస్తుల్లోపు ఉన్నాయి. ఇక హైరైజ్ భవనాల్లో గ్రౌండ్ ప్లస్ 47 అంతస్తులతో శేరిలింగంపల్లిలో నిర్మితమయ్యే ప్రాజెక్టు అతిపెద్దది. 2022లో టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే..

టీఎస్ బీపాస్ ద్వారా ఇన్ స్టెంట్ రిజిస్ట్రేషన్ల కేటగిరీలో 716, ఇన్ స్టెంట్ అప్రూవల్ విభాగంలో 11,088, సింగిల్ విండో విధానంలో 1920 అనుమతులు ఇవ్వగా.. 2390 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసింది. వ్యక్తిగత రెసిడెన్షియల్ భవనాల కేటగిరీలో 11,812, రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ భవనాల కేటగిరీలో 1934, వాణిజ్య భవనాల విభాగంలో 192, ఇన్ స్టిట్యూషనల్ కేటగిరీలో 21, అసెంబ్లీ భవనాల విభాగంలో 6, ఇండస్ట్రియల్ కేటగిరీలో 7, మెడికల్ విభాగంలో 18, పార్కింగ్ టవర్ కేటగిరీలో ఒకటి, పబ్లిక్ యుటిలిటీ కేటగిరీలో 3, రెసిడెన్షియల్ కమర్షియల్ (మిక్స్ డ్) విభాగంలో 5 అనుమతులు ఇచ్చింది. మొత్తమ్మీద 2022లో భవన నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.1056.37 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు పలు రోడ్డు విస్తరణ పనుల కోసం జీహెచ్ఎంసీ విజయవంతంగా ఆస్తుల సేకరణ పూర్తి చేసింది. 2022లో 18 రోడ్డు పనులు పూర్తి చేయగా.. ఇందుకోసం 515 ప్రాపర్టీలను సేకరించింది. 483 టీడీఆర్ సర్టిఫికెట్లు జారీచేసింది.

This website uses cookies.