నగరానికి చెందిన పేరెన్నిక గల నిర్మాణ సంస్థ వర్టెక్స్ హోమ్స్.. మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ అనే ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 8.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. స్టిల్ట్ ప్లస్ 30 అంతస్తుల స్కై స్క్రేపర్‌ని నిర్మిస్తోంది. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 1428. రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లను.. సుమారు 1340 నుంచి 2030 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. కేవలం క్లబ్ హౌజ్‌ను దాదాపు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు.
మియాపూర్‌లో వ్యూహాత్మక ప్రాంతంలో వర్టెక్స్ సంస్థ విరాట్ ప్రాజెక్టును డిజైన్ చేసింది. ఇక్కడ్నుంచి సిల్వర్ ఓక్స్, కెనెడీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ స్కూళ్లు.. నారాయణ, శ్రీచైతన్య ఇంటర్ కళాశాలలు, గోకరాజు రంగరాజు, వీఎన్ఆర్ ఇంజినీరింగ్ వంటి కళాశాలలు.. అంతెందుకు జేఎన్‌టీయూ కూడా చేరువలోనే ఉంటుంది. అత్యవసరాల్లో ఆస్పత్రులు సమీపంలోనే ఉన్నాయి. షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లకు సులువుగా చేరుకోవచ్చు.
సుమారు యాభై వేల చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తున్న క్లబ్ హౌజ్ ఈ ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. మల్టీపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను డిజైన్ చేశారు. బ్యాడ్మింటన్ కోర్టు, స్క్వాష్ కోర్టు, బిలియర్డ్స్ లాంజ్, టీటీ లాంజ్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ విత్ డెక్, కిడ్స్ పూల్, మోడ్రన్ జిమ్, ప్రీవ్యూ థియేటర్ వంటివి పొందుపరుస్తారు. బిజినెస్ లాంజ్, కాన్ఫరెన్స్ రూమ్, స్పా, యోగా, మెడిటేషన్, బ్యాంకెట్ హాల్, క్రెష్, కేఫ్‌టీరియా వంటి వాటికి స్థానం కల్పిస్తారు.
వర్టెక్స్ విరాట్ ప్రత్యేకత ఏమిటంటే.. ముంబై జాతీయ రహదారికి అతి చేరువలో ఉంటుంది. ఇక్కడ్నుంచి మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్‌కు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. మెట్రో స్టేషన్ విరాట్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉంటుంది. అలా నడుచుకుంటూ మెట్రో స్టేషన్‌కు వెళ్లొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్వే లైనును బీహెచ్ఈఎల్ వరకూ విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అతిత్వరలో సాకారమయ్యే కొత్త మెట్రో రైలు మార్గం వల్ల వర్టెక్స్ విరాట్‌లో నివసించేవారికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
This website uses cookies.