poulomi avante poulomi avante

డీఎల్ఎఫ్ ఫ్లాట్.. రూ.95 కోట్లు

దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అమ్మకం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎల్ఎఫ్ గుర్గావ్ లోని నాగరిక గోల్ఫ్ కోర్సు రోడ్డులో నిర్మిస్తున్న ది కామెలియోస్ లోని ఓ ఫ్లాట్ రూ.95 కోట్లకు అమ్ముడైంది. 10,813 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ను సింగపూర్ కు చెందిన ఎన్నారై, వి బజార్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ హేమంత్ అగర్వాల్ భార్య స్మితి అగర్వాల్ కొనుగోలు చేశారు. ఆమె ప్రస్తుతం వెస్ బాక్ లైఫ్ స్టైట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ కింద రూ.4.75 కోట్లు చెల్లించారు.

ఒప్పందం కింద 10,813 చదరపు అడుగుల ఫ్లాట్ తోపాటు ఐదు కారు పార్కింగ్ స్లాట్లు కూడా వస్తాయి. కాగా, ఈ డీల్ తో ఢిల్లీ, గురుగ్రామ్ లోని ఆస్తుల ధరల వ్యత్యాసం తగ్గిందని పలువురు రియల్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గతేడాది ఇదే ప్రాజెక్టులోని 11వేల చదరపు అడుగుల ఫ్లాట్ రూ.114 కోట్లకు అమ్ముడైంది. అలాగే కామెలియాస్ లోని డీఎల్ఎఫ్ బేర్ షెల్ లగ్జరీ హౌసింగ్ యూనిట్ 2014లో చదరపు అడుగుకు రూ.22,500 చొప్పున అమ్ముడైంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles