Categories: PROJECT ANALYSIS

ప్యాండమిక్లో ‘‘ప్రదీప్’’ జోరు

హైదరాబాద్లో ప్యాండమిక్ లో ఫ్లాట్లను విక్రయించిన ఘనత కేవలం కొన్ని సంస్థలకే దక్కుతుంది. అందులో ప్రముఖంగా నిలుస్తుంది.. ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ (Pradeep Constructions). ఈ సంస్థకు భాగ్యనగరంతో విడదీయరాని బంధం ఉంది. సుమారు ముప్పయ్యేళ్ల నుంచి నిర్మాణాల్ని చేపడుతోంది.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు ముప్పయ్యేళ్ల అనుభవం గల ఈ సంస్థ.. రాజ్ భవన్ రోడ్డులోని ‘ద పార్క్’ హోటల్ పక్కనే.. దాదాపు రెండు ఎకరాల్లో ‘‘ప్రదీప్ బ్లిస్’’ అనే హైరైజ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. పదిహేడు అంతస్తులు గల రెండు టవర్లు.. పీవీ నర్సింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్డుకు కొత్త పేరు)కు అభిముఖంగా క‌నిస్తుంటాయి. కేవలం కొద్ది మందికే ప్రత్యేకంగా నిర్మితమవుతున్న ఈ నిర్మాణంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి వెరీ వెరీ స్పెషల్ పర్సన్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ప్రదీప్ బ్లిస్ ప్రత్యేకతల్ని అర్థం చేసుకున్న పలువురు కొనుగోలుదారులు సెకండ్ వేవ్ తో సంబంధం లేకుండా.. ప్లాట్లను కొనుగోలు చేయడం హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. స్ట్రాటజిక్ లొకేషన్.. పేరెన్నిక గల నిర్మాణ సంస్థ కావడం.. స్ట్రక్చర్ మొత్తం పూర్తయ్యి.. అంతర్గత పనులు వేగంగా జరుగుతుండటం.. ఇలాంటి అంశాలన్నీ గమనించే కొనుగోలుదారులు తమ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొంటున్నారని సంస్థ ఎండీ ప్రదీప్ రెడ్డి ‘రియల్ ఎస్టేట్ గురు’కి తెలిపారు.
ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ | Pradeep Constructions | ప్రదీప్ బ్లిస్

2022 మార్చిలో హ్యాండోవ‌ర్‌..

రెండు టవర్లలో వచ్చే ఫ్లాట్ల సంఖ్య 153.. అయినప్పటికీ, ఒక్కో ఫ్లాటుకు మూడు కారు పార్కింగుల సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2300 నుంచి 5100 చదరపు అడుగుల్లో కడుతున్నారు. 2022 మార్చిలో కొనుగోలుదారులకు అందించడానికి నిర్మాణ పనుల్ని శరవేగంగా జరపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల మూడు నెలలు ఆలస్యమైంది. లేకపోతే, ఈ ఏడాది డిసెంబరులోనే కొనుగోలుదారులకు అందజేసేది. ఈ ప్రాజెక్టు ల్యాండ్ స్కేపింగ్, ఫైవ్ లెవెల్ క్లబ్ హౌజు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ముందే చెప్పుకున్నట్లు.. ఈ ఎక్స్ క్లూజివ్ నిర్మాణంలో కొద్దిమంది నివసించడానికి మాత్రమే అవకాశముంది. మరి, మీరు ఆ అదృష్టవంతుల జాబితాలో చేరాలంటే.. వెంటనే ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ ను సంప్రదించండి.

This website uses cookies.