Categories: TOP STORIES

లైఫ్ సైన్సెస్ సంస్థ‌ల‌కు హైదరాబాద్ అడ్డా

లైఫ్ సైన్సెస్ సంస్థ‌ల‌కు హైద‌రాబాద్ మూడో ప్రాధాన్య‌త న‌గ‌రంగా అవ‌త‌రించింద‌ని సీబీఆర్ఈ తెలియ‌జేసింది. ఈ సంస్థ తాజాగా ‘లైఫ్ సైన్సెస్ ఇన్ ఇండియా: ది సెక్టార్ ఆఫ్ టుమారో’ అనే నివేదిక విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. 2019-2022 మ‌ధ్య‌కాలంలో హైద‌రాబాద్‌లో లైఫ్ సైన్సెస్ సంస్థ‌లు సుమారు కోటీ అర‌వై ల‌క్ష‌ల చద‌ర‌పు అడుగుల ఆఫీసు స‌ముదాయాన్ని లీజుకు తీసుకున్నాయి.

ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు, ఢిల్లీఎన్‌సీఆర్ త‌ర్వాత మూడో న‌గ‌రంగా హైద‌రాబాద్ నిలిచింది. పాన్-ఇండియా ప్రాతిపదికన ఆఫీస్ స్పేస్లో సుమారు 19 శాతం వాటాను న‌మోదు చేసింది. నగరంలో పెద్ద క్లస్టర్‌లు, గ్రేడ్ A కార్యాలయ స్థలాలు, నాణ్యమైన ఆర్‌&డీ ల్యాబ్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్లు మరియు పరిశోధనా సంస్థలు ఉండట‌మే దీనికి కార‌ణంగా పేర్కొంది.

This website uses cookies.