త్రీ ఇడియట్స్ సినిమాలో రెండు చేతులతో ఒకేసారి రాసి పారేసే వీరూ సహస్రబుద్ధి క్యారెక్టర్ తో ఎంతోమందిని అలరించిన బొమన్ ఇరానీ గత 47 సంవత్సరాల నుంచి నివసిస్తున్న పురాతన పరిసరాల్లో బైకుల్లా ఒకటి. ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలతో నిండి ఉంది. పాత రోజులలో బైకుల్లాలో సంపన్న నివాసాలు ఉండే ఓ ప్రాంతం ఆయన సొంతం. అయితే, ప్రస్తుతం ఆ ప్రధాన ఆకర్షణలన్నీ విభిన్నంగా ఉన్నాయి.
‘అక్కడ వందేళ్లకు పైబడిన ప్రాపర్టీ ఉంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు దానిని తిరిగి డెవలప్ చేయాలనుకున్నారు. కానీ అది దాని సొగసును కోల్పోయింది. నేను బైకుల్లా వచ్చినప్పుడు గత కాలపు సోయగాన్ని స్ఫురణకు తెచ్చే విచిత్రమైన ప్రదేశం నన్ను బాగా ఆకర్షించింది. నేను రెండు బెడ్ రూమ్ ప్లాట్ కోసం చూస్తుండగా.. బ్రోకర్ మాకు మూడు బెడ్ రూమ్ ల ఫ్లాట్ చూపిస్తానని హామీ ఇచ్చాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు సంతకం చేసిన వెంటనే ఈఎంఐ ఎంత పడుతుందో లెక్కలు వేసిన సంగతి నాకు బాగా గుర్తుంది. వారాలతరబడి నాలో నేను ఆ లెక్కలు వేసుకున్నాను’ అని బొమన్ నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.
బొమన్ ఇరానీ ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతున్న సంగతిని అనిల్ కపూర్ గ్రహించి, అందుకు కారణం తెలుసుకోకుండా ఉండలేకపోయారట. మీరు చాలా కాలంగా ఏం ఆలోచిస్తున్నారని బొమన్ ను అనిల్ అడిగితే.. నేను ఫ్లాట్ కొనే విషయాన్ని ఆలోచిస్తున్నా అని సమాధానం ఇచ్చారు. దీంతో అనిల్ తనను ప్రోత్సహించారని.. ముందు ఫ్లాట్ చూడు, డబ్బులు అవే వస్తాయని భరోసా ఇచ్చారని తెలిపారు. కొన్నాళ్లపాటు ఫర్నిచర్ కొనకుండా నేలపైనే పడుకోవాలని.. కానీ ఫ్లాట్ మాత్రం కొనుక్కోవాలని సూచించాని బొమన్ వెల్లడించారు. ఇక ఫ్లాట్ కొనడం ఒక ఎత్తైతే.. దాని రంగులు మరో ఎత్తని పేర్కొన్నారు. నెలల తరబడి తన భార్యను ఒప్పించిన తర్వాతే గోడకు రంగు వచ్చిందన్నారు.
స్కై బ్లూ చాలా పేలవంగా ఉందనేది ఆమె భావన. మూడు సార్లు పెయింటింగ్ వేయించిన తర్వాత తన భార్యకు ఆ రంగు నచ్చిందని చెప్పారు. చివరకు ఆ రంగు చాలా బాగా వచ్చిందన్నారు.
తన అభయారణ్యంలో నిశ్శబ్దంగా ఉండే సొంత స్థలం కూడా ఉందని వివరించారు. రిక్లైనర్ సీట్లతో కూడిన థియేటర్ ను డిజైన్ చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి తనకు వాటి అవసరం ఎంత ఉందో చెప్పానని పేర్కొన్నారు. తమ కిటికీల నుంచి తమ సొంత పార్సీ పట్టణాన్ని చూడొచ్చని వ్యాఖ్యానించారు. ‘నాకు ఓ అలవాటు ఉంది. అర్ధరాత్రి నిద్రలో నాకు ఏదైనా ఆలోచన వస్తే.. వెంటనే లేచి ఈ మూలకు వచ్చి నోట్స్ రాస్తాను. అందుకోసం నా నిద్ర పోయినా పర్వాలేదనుకుంటా’ అని చెప్పారు.
This website uses cookies.