Categories: TOP STORIES

కొత్త బెంగళూరుగా హైదరాబాద్?

రియల్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలను అధిగమించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా భాగ్యనగరం ఉద్భవించింది. బెంగళూరు-వర్సెస్-ఇతర-నగరాల పోటీలో హైదరాబాద్ దూసుకొస్తోందని, హైదరాబాద్‌.. కొత్త బెంగళూరుగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు హైదరాబాద్ ను ఉన్నతంగా అభివర్ణించగా.. హైదరాబాద్ పరిపూర్ణమైనదని, బెంగళూరు కంటే హైదరాబాద్ ఉత్తమం అని కొందరు వ్యాఖ్యానించారు.

ఓ నెటిజన్ మాత్రం హైదరాబాద్ ను మూర్ఖుల స్వర్గమని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలను అధిగమించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ గా ఉద్భవించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో హైదరాబాద్‌లో గృహాల ధరలు 2023లో 11 శాతం పెరిగాయని, పెట్టుబడిదారులు, తుది వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ ను ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

This website uses cookies.