Categories: Celebrity Homes

అటు సినిమా.. ఇటు స్థిరాస్తి

అద్దెల ద్వారానూ ఆదాయం ఆర్జిస్తున్న సినీనటులు

బాలీవుడ్ నటులు అటు సినిమాలతోపాటు ఇటు రియల్ రంగంలోనూ రాణిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటైన ముంబైలో కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొని అద్దెకు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముంబైలోని పలువురు బాలీవుడ్ తారలు ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయం ఆర్జిస్తున్నారు. అలాంటి వారిలో ఐదుగురు సెలబ్రిటీల వివరాలివీ..

1. షాహిద్ కపూర్, మీరా కపూర్ వర్లీలో లగ్జరీ అపార్ట్ మెంట్ అద్దెకు ఇచ్చారు. నెలకు రూ.20 లక్షల చొప్పున ఐదేళ్ల కాలానికి అద్దెకు ఇస్తూ ఒప్పందం చేసుకున్నారు. ఒబెరాయ్ రియల్టీ ప్రాజెక్టు 360 వెస్ట్ లో 5,395 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉంది. మూడు కార్ పార్కింగ్‌లు కూడా ఉన్నాయి.

2. అజయ్ దేవగన్ అంధేరి వెస్ట్ లో కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు ఇచ్చారు. 3,455 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని రూ.7 లక్షల నెలవారీ అద్దెకు ఇచ్చారు. వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ టవర్‌లో ఈ ఆఫీస్ స్పేస్ ఉంది. ఒప్పందంలో భాగంగా మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.

3. కార్తిక్ ఆర్యన్ జుహులో ఫ్లాట్‌ని అద్దెకు ఇచ్చారు. ప్రెసిడెన్సీ కో-ఆపరేటివ్ సొసైటీలోని సిద్ధి వినాయక్ భవనంలో 1,912 చదరపు అడుగుల ప్రాపర్టీని నెలకు రూ.4.5 లక్షల అద్దెకు ఇచ్చారు.

4. సల్మాన్ ఖాన్ శాంతాక్రజ్‌లో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇచ్చారు. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో తనకున్న 23,042 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని ల్యాండ్‌క్రాఫ్ట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెలకు ₹90 లక్షలకు అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. ఒప్పందం కింద సెక్యూరిటీ డిపాజిట్ గా రూ. 5.4 కోట్లు తీసుకున్నారు.

5. కరణ్ జోహార్ అంధేరీ వెస్ట్ లోని రెండు కమర్షియల్ ప్రాపర్టీని ఒకటి నెలకు ₹17.56 లక్షల చొప్పున, రెండోది రూ.6.15 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఐదేళ్ల కాలానికి అద్దె ఒప్పందం చేసుకున్నారు.

This website uses cookies.