మీరు హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కోవాలని భావిస్తున్నారా? అయితే, కేవలం కోట్లు ఉంటేనే నగరంలో సొంతింటి కల సాకారం అవుతుందనే విషయం కరెక్టు కాదు. యాభై లక్షల్నుంచి కోటీ రూపాయల్లోనూ లగ్జరీ టూ బెడ్రూమ్ ఫ్లాట్లు లభిస్తున్నాయి. కాకపోతే, కోర్ సిటీ కాకుండా శివారు ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రాంతాన్ని బట్టి.. వీటి ధర రూ.54 లక్షల్నుంచి చెబుతున్నారు. కాబట్టి, కాస్త చిన్న సైజులో ఫ్లాటు కావాలని భావించేవారు.. తమ ఆఫీసుకు సులువుగా రాకపోకల్ని సాగించేందుకు వీలుండే ప్రాంతాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేయాలి.
గ్రేటర్ హైదరాబాద్ లో 50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు చాలా ప్రాంతాల్లో ఇల్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఏయే ప్రాంతాల్లో ఈ శ్రేణిలో గృహాలు నిర్మాణంలో ఉన్నాయో, అవి ఎప్పటికి పూర్తవుతాయో తెలుసుకుందాం. కోంపల్లిలో అతి తక్కువ ధరకే డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కొంత మంది డెవలపర్లు చదరపు అడుక్కీ రూ.4500 చొప్పున ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. మరి, నగరంలో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయో తెలుసుకుందామా..
బిల్డర్ ప్రాజెక్టు పేరు ఎక్కడ ధర విస్తీర్ణమెంత నిర్మాణ స్థాయి?