మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత నాలుగేళ్లలో నయా పైసా మెయింటనెన్స్‌ను పెంచకుండా.. కమ్యూనిటీని సమర్థంగా నిర్వహిస్తోంది. ఒకవైపు నాలుగేళ్ల నుంచి సిబ్బందికి ఏటా పది శాతం జీతాల్ని పెంచుతూ.. మరోవైపు అభివృద్ధి పనుల్ని సైతం అదే స్థాయిలో చేపట్టింది. గత నాలుగేళ్లలో సుమారు డెబ్బయ్ కి పైగా సీసీ టీవీలను పెంచి.. నివాసితులకు భద్రతకు పెద్దపీట వేసింది. ఏటా సుమారు 80 రోజుల్లో పండుగలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్ని సమర్థంగా నిర్వహించింది.
నివాసితులు ప్రతినెలా చెల్లించే నెలసరి నిర్వహణ సొమ్ము మీదే ఆధారపడకుండా.. ఇతర ఆదాయ మార్గాల్ని గణనీయంగా పెంచింది. నివాసితులు ఎదుర్కొనే సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు బ్లాకుల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను 2020లోనే ఏర్పాటు చేసింది. మొత్తానికి, గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణను ఎలా చేయాలనే విషయాన్ని చేసి చూపెట్టింది. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల ప్రసాద్ మాట్లాడుతూ.. రెసిడెంట్స్ సలహా సూచనలు, కమిటీ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో తమ కమ్యూనిటీని మరింత డెవలప్ చేసేందుకు తగిన చర్యల్ని తీసుకుంటామని తెలిపారు.
This website uses cookies.