అల్కాపురిలో అనుహార్ గృహాలు
గత 14 ఏళ్లుగా నిర్మాణరంగంలో దూసుకెళ్తున్న అనుహార్ గ్రూప్ అల్కాపురి టౌన్ షిప్ లో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మిస్తోంది. రామిరెడ్డి టవర్స్ ప్రాజెక్టు పేరుతో నాలుగు టవర్లతో ఒక ప్రాజెక్టు, అనుహార్ టవర్స్ పేరుతో మరో నాలుగు టవర్లతో రెండో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రాజెక్టుల విషయానికొస్తే రామిరెడ్డి టవర్స్ లో ఏకంగా 62 శాతం ఓపెన్ ఏరియా ఉండటం విశేషం. సెల్లార్ + స్టిల్ట్ + 10 అంతస్తులతో నాలుగు టవర్లలో 370 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక అనుహర్ టవర్స్ 4.12 ఎకరాల స్థలంలో మూడు సెల్లార్లు, గ్రౌండ్, 16 అంతస్తులతో నాలుగు టవర్లతో నిర్మాణమవుతోంది. ఇందులో 578 ఫ్లాట్లు ఉండనున్నాయి. కళ్లు చెదిరే రీతిలో నిర్మాణం కానున్న 6 లెవెల్ క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణ కానుంది.
అపార్ట్ మెంట్ ధరకే లగ్జరీ విల్లా
దాదాపుగా అపార్ట్ మెంట్ ధరకే లగ్జరీ విల్లాలు అందుబాటులో ఉన్నాయని మిర్చి డెవలపర్స్ అంటోంది. కొల్లూరులోని పాటి వద్ద ఈ సంస్థ ప్రీమియం లగ్జరీ విల్లాలు నిర్మిస్తోంది. కొల్లూరు ఐటీ హబ్ కు సమీపంలో ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం. వెనీస్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3బీహెచ్ కే, 4 బీహెచ్ కే, 5 బీహెచ్ కే విల్లాలు అందుబాటులోకి రానున్నాయి. ఈస్ట్ ఫేసింగ్ విల్లాలు 183 చదరపు గజాల్లో 2599 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. వెస్ట్ ఫేసింగ్ విల్లాలు 165 చదరపు గజాల్లో 2230 చదరప అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నాయి. మరింకెందుకు ఆలస్యం.. ఈరోజే మోడల్ విల్లా చూడండి.
హానర్ హోమ్స్ హైరైజ్ టవర్స్
ఎత్తైన ఆకాశహర్మ్యాల్లో (హైరైజ్ టవర్స్) నివసించాలనుకునేవారి కోసం హానర్ హోమ్స్ సంస్థ గోపనపల్లిలో హానర్ అక్వాంటిస్ పేరుతో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించింది. 2021కి సంబంధించి టైమ్స్ బిజినెస్ అవార్డుల్లో బెస్ట్ హైరైజ్ ప్రాజెక్టు ఆన్ గోయింగ్, మోస్ట్ ప్రిఫర్డ్ డెవలపర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు పొందిన ఈ సంస్థ.. కొనుగోలుదారులకు కావాల్సిన అన్ని వసతులు ఉండేలా వంద శాతం వాస్తుతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. 10.5 ఎకరాల స్థలంలో 81 శాతం ఓపెన్ ఏరియాకు వదిలి రెండు బేస్ మెంట్లు + గ్రౌండ్ + 30 అంతస్తులతో ఆరు టవర్లను నిర్మిస్తోంది. 1315 చదరపు అడుగుల నుంచి 1965 చదరపు అడుగుల వరకు 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే ఫ్లాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక 50వేల చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్, మల్టీ యుటిలిటీ బ్లాక్.. ఈ ప్రాజెక్టుకే హైలైట్ గా నిలవనుంది.