poulomi avante poulomi avante

సీట్లే మీకు కావాలా..! సిటీ ప‌ర్యావ‌ర‌ణం అక్క‌ర్లేదా?

  • అన‌ధికారిక‌రంగా ట్రిపుల్ వ‌న్ ర‌ద్దు
  • విచ్చ‌ల‌విడిగా అక్ర‌మ నిర్మాణాలు
  • ఓట్ల కోసం ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీస్తున్న
    బీఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌భుత్వం
  • 111 జీవోపై పార్టీల‌న్నీ త‌మ వైఖ‌రిని తెల‌పాలి
  • న‌గ‌ర‌వాసులు, ప‌ర్యావ‌ర‌ణవేత్త‌ల ఆందోళ‌న‌

తెలంగాణ రాష్ట్రంలో ఒక‌వైపు ఎన్నిక‌ల హ‌డావిడి జోరుగా కొనసాగుతోంది.. మ‌రోవైపు రియ‌ల్ ఎస్టేట్ రంగం, రైతులు, ప్ర‌జ‌ల‌తో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌లు ట్రిపుల్ వ‌న్ జీవోపై ఏయే పార్టీ ఎలా స్పందిస్తునే విష‌యంలో ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నారు. అధికారిక బీఆర్ఎస్ పార్టీ ఎలా త‌యారైందంటే.. వర‌ద‌లు సంభ‌వించి హైద‌రాబాద్ కొట్టుకుపోయినా ఫ‌ర్వాలేదు.. త‌మ‌కు మాత్రం ఎన్నిక‌ల్లో ఓట్లే కీల‌క‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు మండిప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండా, అంత‌ర్జాతీయ ఖ్యాతినార్జిస్తోన్న హైద‌రాబాద్‌లో ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల్సిన బాధ్య‌త అధికార పార్టీ మీదే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ట్రిపుల్ వ‌న్ జీవోను తొల‌గించామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యం తెలిసిందే. కానీ, ఇంత‌వ‌ర‌కూ అందుకు సంబంధించిన జీవోను ఎక్క‌డా విడుద‌ల చేయ‌లేదు. ఈ ర‌ద్దుపై వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు, ప‌లు రాజ‌కీయ పార్టీలు జంట జ‌లాశ‌యాల్ని కాపాడాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు. ఈ జీవోను ఎట్టి ప‌రిస్థితిలో రద్దు చేయ‌కూడ‌ద‌ని, ఎందుకంటే భ‌విష్య‌త్తులో వ‌ర‌ద‌లు సంభ‌విస్తే హైద‌రాబాద్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ వ‌ర‌ద‌లు పెరిగితే భాగ్య‌న‌గ‌రాన్ని ర‌క్షించుకునేందుకు ఈ జంట జ‌లాశ‌యాలు అత్య‌వ‌స‌రమ‌ని విన్న‌విస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత‌ను వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ప్రభుత్వం ట్రిపుల్ వ‌న్ జీవోను తొల‌గించి 69 జీవోను ప్ర‌వేశ‌పెట్టామ‌ని చెబుతోంది. కాక‌పోతే, ఈ జీవో అధికారికంగా ఇంకా విడుద‌ల కాలేదు. ఒక‌వేళ అయినా, ఆ జీవోను ఎవ‌రికి అందుబాటులో లేకుండా ప్ర‌భుత్వం చేసింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అందుకే, సాంకేతికంగా చూస్తే 111 జీవో ర‌ద్దు కాలేదు. ఇదే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం రెండుసార్లు హై కోర్టుకు విన్న‌వించింది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఈ జీవో అమ‌లుపై నిలినీడ‌లు క‌మ్ముకున్నాయ‌ని చెప్పొచ్చు.

చిన్న వ‌ర్షం ప‌డితేనే హైద‌రాబాద్ న‌గ‌రం అత‌లాకుతలం అవుతుంది. ట్రాఫిక్ ర‌ద్దీ పెరిగి ప్ర‌జ‌లంతా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌ట్రెండు కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌డానికి గంట‌ల‌కొద్దీ రోడ్ల మీద జాగారం చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో 111 జీవో తొల‌గిస్తే.. ఆయా ప్రాంతాల్లో నిర్మించే కొత్త‌ నిర్మాణాల నుంచి విడుద‌ల‌య్యే మురుగునీటి వ‌ల్ల జంట జ‌లాశ‌యాలు క‌లుషిత‌మ‌వుతాయి. ఫ‌లితంగా, వ‌రద‌లు సంభ‌విస్తే ఆయా మురుగుని హైద‌రాబాద్‌లోకి వ‌దిలివేయాల్సి వ‌స్తుంది. దీంతో, భాగ్య‌న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎంత ఇబ్బందో పాల‌కులు అర్థం చేసుకోవాలి.
ప్ర‌స్తుతం జంట జ‌లాశ‌యాలు స్వ‌చ్ఛ‌మైన నీటి వాన‌తో నిండిఉన్నాయి. ప్ర‌జ‌ల‌కు తాగునీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. వ‌ర్ష‌పునీటిని సంర‌క్షిస్తే భూగ‌ర్భజ‌లాలు పెరుగుతాయి. కొత్త‌గా నిర్మించే ఎస్టీపీలు, రింగ్ మెయిన్‌ల వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు అంటున్నారు. పైగా, ఈ జంట జ‌లాశ‌యాల‌కు నష్టం వాటిల్లితే ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌తికూల ప్ర‌భావం పడుతుంది. ఫ‌లితంగా రెండు డిగ్రీల వేడి పెరుగుతుంది. ప్ర‌పంచంలోని లివ‌బుల్ న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌లో భ‌విష్య‌త్తు త‌రాల‌కు అన్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
ట్రిపుల్ వ‌న్ జీవోను తొల‌గిస్తున్నామ‌ని మంత్రిమండ‌లి అధికారికంగా వెల్ల‌డించ‌గానే.. అక్ర‌మ రీతిలో కొంద‌రు బిల్డ‌ర్లు బ‌డా నిర్మాణాల్ని చేప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌ట్టినాగుల‌ప‌ల్లిలో అధికారుల‌కు అమ్యామ్యాలు స‌మర్పించి హైఎండ్ విల్లాలను నిర్మిస్తున్నార‌ని తెలిసింది. భ‌విష్య‌త్తులో హైద‌రాబాద్ అభివృద్ధి చెందాల‌న్నా.. అంత‌ర్జాతీయ స్థాయి న‌గ‌రంగా ఖ్యాతినార్జించాల‌న్నా.. ట్రిపుల్ వ‌న్ జీవోను తొల‌గించ‌కూడ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు కోరుతున్నారు.

 

హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు ఏం కావాలి?

111 జీవోను క‌ఠినంగా అమ‌లు చేయాలి. జంట జ‌లాశ‌యాల‌ను ర‌క్షించుకోవ‌డంతో పాటు జీవ‌వైవిధ్యాన్ని కాపాడేందుకు వీలు అవుతుంది. ఎన్నిక‌ల్లో ఈ అంశంపై ప్ర‌తి పార్టీ త‌మ అభిప్రాయాల్ని తెలియ‌జేయాలి. ఎందుకంటే, దీనిపై హైద‌రాబాద్ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డుతుంది ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త డా. లుబ్నా స‌ర్వ‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles