Categories: TOP STORIES

ఆకాశహర్మ్యాల్లో.. అప్రిసీయేషన్ అధికం

హైదరాబాద్లో ప్రస్తుతం ఎంతలేదన్నా నలభై నుంచి యాభై ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. ప్రధానంగా, పశ్చిమ హైదరాబాద్లోనే వీటిని నిర్మించే వారి సంఖ్య పెరుగుతోంది. మరి ఇన్నిన్ని నిర్మాణాలు వస్తే.. వాటిని కొనుగోలు చేసేదెవరు? అందులో నివసించేదెవరు? వీటికి అప్రిసీయేషన్ లభిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. హైదరాబాద్లో ఆకాశహర్మ్యాల ట్రెండ్ కు ఆదరణ ఆరంభమైంది ఎప్పుడో తెలుసా? మై హోమ్ అవతార్ ప్రాజెక్టు ఆరంభమైనప్పట్నుంచే. ఈ సంస్థ 2016 లో పొప్పాల్ గూడలో జి ప్లస్ ౩౦ అంతస్తుల మై హోమ్ అవతార్ ఆకాశహర్మ్యాన్ని ప్రారంభించింది. అప్పట్లో చదరపు అడుక్కీ కేవలం రూ.3 850 కే విక్రయించింది. అంటే, డబుల్ బెడ్ రూం ఫ్లాటును రూ.60 లక్షలకు అందజేసింది. రికార్డు స్థాయిలో పూర్తి చేయడంతో ఇప్పుడు అవతార్లో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.9000 నుంచి రూ.10,000 పలుకుతోంది. అంటే, ఇంత తక్కువ సమయంలో అధిక అప్రిసియేషన్ అందుకున్నందు వల్లే.. ఎక్కువ శాతం మంది బయ్యర్లు మై హోమ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణంగా చాలామంది బయ్యర్లు ఆకాశహర్మ్యాల్లో అప్రిసియేషన్ ఎక్కువగా ఉండదని భావిస్తుంటారు. కానీ, ఇలాంటి ఆలోచన తప్పు అని హైదరాబాద్ నిర్మాణ రంగంలో నిరూపితమవుతోంది. మై హోమ్ అవతార్ తో పాటు ఇంకా పలు ప్రాజెక్టులే ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పొచ్చు. పశ్చిమ హైదరాబాద్లో అధిక విస్తీర్ణం గల ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లు కొనాలని భావించేవారికి అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్టు లొకేషన్, అందులోని సౌకర్యాలు, సదుపాయాలు, నిర్మాణం ఎత్తు, ఎలివేషన్, ఫ్లాట్ల విస్తీర్ణం బట్టి.. ఒక్కో ఫ్లాట్ ధర రూ.6 కోట్ల నుంచి చెబుతున్నారు. గరిష్ఠంగా రూ.20 దాకా రేటు పలికే ఫ్లాట్లు నగరంలో ఉండటం విశేషం. ఇవి ఎక్కువగా నానక్ రాంగూడ, రాయదుర్గం నాలెడ్జి సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో నిర్మితం అవుతున్నాయి. కొండాపూర్లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో ఆరంభంలో చదరపు అడుక్కీ రూ.4500 చొప్పున ఫ్లాట్లను విక్రయించారు. వీటిలో కొన్ని బ్లాకులు పూర్తి కాగా.. మరికొన్ని ప్రస్తుతం అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం చదరపు అడుక్కీ ఎంతలేదన్నా రూ.9000 కి అటుఇటుగా చెబుతున్నారు. మొత్తానికి, ఆకాశహర్మ్యాలకు మంచి అప్రిసీయేషన్ లభిస్తుందని నగర రియల్ రంగంలో నిరూపితమవుతోంది.

 

కోకాపేట్ కు ఫుల్ డిమాండ్

ఆఫీసుకు చేరువగా ఉండాలనే ఉద్దేశ్యంతో అధిక శాతం మంది కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వంటి ప్రాంతాల్లో నివసించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఏ జంక్షన్ నుంచి కొల్లూరు దాకా ఆధునిక సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ మార్గంలో ప్లే జోన్స్, ఔట్ డోర్ స్పోర్ట్స్, 24 గంటలు ఫుడ్ స్టాళ్లు.. గండిపేట్ వద్ద సరికొత్త పార్కు వంటివి.. ఈ ప్రాంతానికి సరికొత్త సొబగులను అద్దుతోంది. కాబట్టి, రానున్న రోజుల్లో కాకోపేట్ వంటి ప్రాంతం ఆధునిక నగరంగా అవతరిస్తుంది.. ఇక్కడి ప్రాపర్టీలకు మంచి అప్రీసియేషన్ లభిస్తుంది.– ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్

అప్రిసీయేషన్ ఎక్కువే..

హైదరాబాద్లో కొనుగోలుదారుల సామర్థ్యం పెరిగింది. వీరంతా బడా ఫ్లాట్ల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రధానంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాలు, పెద్ద కంపెనీల్లో పని చేసే సీఈవోలు వంటివారు ఎక్కువగా ఆకాశహర్మ్యాల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరంతా గతంలో వ్యక్తిగత ఇళ్లను కొనేవారు. ఇప్పుడు, ఆధునిక సదుపాయాలు, సౌకర్యాల కారణంగా బడా ప్రాజెక్టుల్లో ఉండేందుకు ముందుకొస్తున్నారు. వాస్తవానికి, నగరంలో ఆకాశహర్మ్యాల పోకడకు మా అవతార్ ప్రాజెక్టు నుంచే మంచి ఆదరణ లభించడం ఆరంభమైంది.

ఎందుకంటే, ఇందులో తొలుత ఫ్లాట్లను చదరపు అడుక్కీ రూ.3,850 చొప్పున విక్రయించాం. ప్రస్తుతం 9,000 నుంచి 10,000 దాకా రేటు పలుకుతోంది. కేవలం ఐదేళ్లలో ఈస్థాయిలో అప్రియేషన్ రావడమంటే మాటలు కాదు. ఇటీవల నిషధకు మంచి గిరాకీ ఏర్పడింది. మరిన్ని స్కై స్క్రేపర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.- శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్, మైహెమ్ కన్ స్ట్రక్షన్స్

This website uses cookies.