తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి రెరా అథారిటీతో పాటు అప్పీలేట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గురువారం డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా రెరా చట్టం 2016లో అమల్లోకి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో 2018లో ప్రారంభించారు. అప్పట్నుంచి ఈ అథారిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నమోదు చేస్తుందే తప్ప.. ఈ రంగంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం లేదు.
• ఇళ్ల కొనుగోలుదారులను పరిరక్షించడంతో పాటు రియల్ రంగంలో పారదర్శకత నెలకొల్పేందుకు రెరా చట్టం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి, రెరా అథారిటీ ఏర్పాటైన ఏడాది లోపే రెగ్యులేటరీ అథారిటీ మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి. ‘ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాల్ని సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈ అంశంపై హై కోర్టులో పిల్ వేశాం. కాకపోతే, దీనిపై ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇంకా నమోదు చేయలేద’ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి తెలిపారు.
This website uses cookies.