Categories: TOP STORIES

హైదరాబాద్లో ఎత్త‌యిన‌ ఆకాశ‌హ‌ర్మ్యం

పేరు: పౌలోమీ ప‌లాజో
ఎత్తు: 55 అంత‌స్తులు

హైద‌రాబాద్‌లోనే అతి ఎత్త‌యిన‌ ఆకాశ‌హ‌ర్మ్యం ఆరంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ ఆరంభించిన ఈ ఆకాశ‌హ‌ర్మ్యానికి పౌలోమీ ప‌లాజో అని నామ‌క‌ర‌ణం చేశారు. దీని ఎత్తు ఎంతో తెలుసా? యాభై ఐదు అంత‌స్తులు. టాప్ ఫ్లోరులో నివ‌సించేవారికి హైద‌రాబాద్ మొత్తం క‌నిపిస్తుంద‌ని చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ అవుతున్న కోకాపేట్లో.. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే గల సర్వీసు రోడ్డులో.. సుమారు 4.6 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పౌలోమీ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఆకాశ‌హ‌ర్మ్యాన్ని న‌గ‌రానికి చెందిన‌ జెనెసిస్ ఆర్కిటెక్స్ డిజైన్ చేసింద‌ని స‌మాచారం.

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు అత్యంత చేరువలో గల పౌలోమీ పలాజోలో.. నిర్మించేది కేవ‌లం 145 ఫ్లాట్లు మాత్ర‌మే. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం ఆరు వేల రెండు వంద‌ల ఇర‌వై ఐదు చ‌ద‌ర‌పు అడుగుల నుంచి ప‌దివేల ఒక వంద అర‌వై చ‌ద‌ర‌పు అడుగుల దాకా ఉంటుంది. నిర్మాణ ప‌నులు ఆరంభ‌మైన ఈ ప్రాజెక్టును 2026లో పూర్తి చేయాల‌ని సంస్థ ప్లాన్ చేసింది. మ‌రి, ఇంత ప్ర‌తిష్టాత్మ‌కమైన ప్రాజెక్టులో ఉన్న 145 ఫ్లాట్ల‌ను.. భార‌త‌దేశంలోని ఎంత‌మంది ద‌క్కించుకుంటారో తెలుసుకోవాలంటే మ‌రి కొంత‌కాలం నివ‌సించాల్సిందే.

This website uses cookies.