Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లో ఆరంభ‌మైన‌.. 55 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యం

  • పౌలోమీ ప‌లాజో.. అంత‌ర్జాతీయ స్థాయి నిర్మాణం
  • ఫ్లాట్ల సంఖ్య‌: 140
  • 75 వేల చ.అడుగుల క్ల‌బ్‌హౌజ్‌
  • 2026 డిసెంబ‌రులో పూర్తి

యాభై రెండో అంత‌స్తుల ఎత్తులో.. ఆకాశంలో మేఘాల్ని చూస్తూ.. రాత్రిపూట న‌క్ష‌త్రాల‌ను లెక్క‌పెడుతూ.. ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించే ఇన్‌ఫినిటీ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూంటే.. ఆ సంతోష‌మే వేరు క‌దూ?

ఓక్క‌సారి కోకాపేట్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు నుంచి పౌలోమీ ప‌లాజోకి ప్ర‌వేశిస్తే చాలు.. అందంగా ముస్తాబైన ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు మీకు ఆనందంగా ఘ‌న‌స్వాగ‌తం చెబుతాయి..

సెవెన్ స్టార్ హోట‌ల్‌ని త‌ల‌పించే రీతిలో.. ఐదు అంత‌స్తుల ఎత్తులో ఏర్పాటైన గ్రాండ్ ఎంట్రెన్స్ లాబీలోకి ప్ర‌వేశించి.. మీ ఇంట్లోకి అడుగుపెడుతుంటే.. ఆ రాజ‌స‌మే వేరు క‌దా..

విదేశాల్లోని ప్రాజెక్టుల్లోకి ప్ర‌వేశించ‌గానే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే ప‌చ్చ‌టి ప‌రిస‌రాలు.. విశాల‌మైన ఖాళీ స్థ‌లాలు.. వెల్‌నెస్ ఫ్లోర్‌.. ఫిట్‌నెస్ ఫ్లోర్‌.. రిక్రియేష‌న్ ఫ్లోర్‌.. డ‌బుల్ హైట్ బాల్క‌నీ..

మొత్తానికి ఇందులోకి అడుగుపెడితే చాలు.. హైద‌రాబాద్ ప్రాజెక్టేనా? లేక ఏ అంత‌ర్జాతీయ న‌గ‌రంలోని నిర్మాణంలోకి ప్ర‌వేశించామా? అనే సందేహం ఎవ‌రికైనా క‌ల‌గ‌క మాన‌దు.

మ‌రి, ఈ 55 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యం గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.. మీకోసం..!

పౌలోమీ ప‌లాజో.. హైద‌రాబాద్ నిర్మాణ రంగంలోనే అసాధార‌ణ‌మైన ప్ర‌ణాళిక‌.. ల‌గ్జ‌రీ లివింగ్ ఆనందానికి స‌రైన చిరునామా.. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మమైన వ‌స్తువుల‌తో మీ వ్య‌క్తిగ‌త ప్రాధాన్య‌త‌ల‌కు పెద్ద‌పీట వేసే క‌ల‌ల లోగిలి ఇదే.. మీ ఇంట్లో నుంచి ప్రతిరోజూ అద్భుతమైన సూర్యాస్తమయాల‌ను వీక్షించొచ్చు.. ప్రపంచంలోని అత్యుత్తమ వస్తువులకు సంబంధించిన మీ వ్యక్తిగత ప్రాధాన్యతలను ప్రతిబింబించే మీ ఇంటిలోని ప్రతి లగ్జరీని యాక్సెస్ చేయండి. ఇందులోకి అడుగుపెడితే చాలు.. మీరు జీవితంలోని అత్యుత్త‌మ ప్ర‌దేశంలో నివసిస్తున్నార‌నే అనుభూతిని పొందొచ్చు. ప్ర‌తి అంగుళంలోనూ వైభ‌వంతో పాటు విలాసాన్ని ఆస్వాదించొచ్చు.

హైద‌రాబాద్ నిర్మాణ రంగాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టే ఆధునిక ఆకాశ‌హ‌ర్మ్యం ఆరంభ‌మైంది. న‌గ‌రానికి చెందిన పౌలోమీ ఎస్టేట్స్ ఆరంభించిన ఈ 55 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యానికి పౌలోమీ ప‌లాజో అని పేరు పెట్టారు. విదేశీ న‌గ‌రాల్ని త‌ల‌ద‌న్నే రీతిలో అభివృద్ధి చెందుతున్న‌ కోకాపేట్‌లో.. హెచ్ఎండీఏ నిర్వ‌హించిన వేలం పాట‌లో 2.3 ఎక‌రాల్ని కొనుగోలు చేసిన పౌలోమీ ఎస్టేట్స్‌.. 55 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిర్మిస్తోంది. ఇందులో వ‌చ్చే ఫ్లాట్ల సంఖ్య‌.. దాదాపు 140. వీటిలో ఇప్ప‌టికే న‌ల‌భై ఫ్లాట్లు అమ్ముడు కావ‌డం విశేషం. ఫ్లాట్ల విస్తీర్ణం విష‌యానికి వ‌స్తే.. 6225 నుంచి 8100 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉంటాయి. 2026 డిసెంబ‌రులోపు ప‌లాజోను పూర్తి చేయాల‌న్న ఉన్న‌త‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. క‌ళ్లు మిరుమిట్లు గొలిపేలా.. అంత‌ర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు క్ల‌బ్ హౌజ్‌ని చూస్తే ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే.

వావ్‌.. క్ల‌బ్ ప‌లాజో!

సుమారు 75 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తున్న క్ల‌బ్‌హౌజ్‌లోకి అడుగుపెడితే చాలు.. అల‌సట తీరిపోవ‌డంతో పాటు స‌రికొత్త ఉత్సాహం నిండుతుంది. ఎందుకంటే, ఈ క్ల‌బ్‌హౌజ్‌ని ఎంతో ప‌క‌డ్బందీగా డిజైన్ చేసింది. మొద‌టి అంత‌స్తుని వెల్‌నెస్ ఫ్లోరుగా తీర్చిదిద్దింది. దాదాపు ఒలంపిక్ సైజులో స్విమ్మింగ్ పూల్‌, కిడ్స్ పూల్‌, స్సా, సానా, జ‌కూజీ, డాన్స్‌, ఫిట్‌నెస్ స్టూడియో, లీజ‌ర్ డెక్ వంటివి ఏర్పాటు చేసింది. లెవెల్ 2లో జిమ్‌, ఎయిరోబిక్స్‌, టేబుల్ టెన్నిస్‌, బిలియ‌ర్డ్స్ రూమ్‌, ఇండోర్ జాగింగ్/ వాకింగ్ ట్రాక్‌, చిల్డ్ర‌న్స్ ప్లే ఏరియా వంటివి డెవ‌ల‌ప్ చేసింది. లెవెల్‌3లోని రిక్రియేష‌న్ ఫ్లోర్‌లో.. ప్రైవేటు డైనింగ్ రూమ్‌, బ్యాంకెట్ హాల్‌, బ్యాంకెట్ లాన్‌, బార్‌బీ క్యూ పిట్‌, ఔట్ డోర్ డైనింగ్ డెక్‌, కాన్ఫ‌రెన్స్ రూము వంటివాటికి స్థానం క‌ల్పించింది. అన్నిర‌కాల వేడుక‌లను జ‌రుపుకోవ‌డానికి సరైన వేదిక‌. ప్ర‌తి సంద‌ర్భానికి స‌రిపోయే విధంగా సౌక‌ర్యాల్ని పొందుప‌ర్చారు. ప్ర‌తి చిన్న అంశాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఇండోర్ జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ప్పుడు.. మోకాళ్ల నొప్పుల్ని త‌గ్గించేందుకు గాను ఈపీడీఎం ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేశారు.

అదృష్ట‌వంతులెవ‌రో..

హైద‌రాబాద్‌లో ఆధునిక ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు మార్కెట్లో ఎప్ప‌టికైనా మంచి గిరాకీ ఉంటుంది. ఈ త‌ర‌హా నిర్మాణాల‌కు మార్కెట్ డిమాండ్ తో పెద్ద‌గా సంబంధం ఉండ‌దు. ఎందుకంటే, ల‌గ్జ‌రీ జీవితాన్ని కోరుకునేవారు మాత్ర‌మే వీటిలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందుకే మేం ప‌లాజోలో న‌ల‌భై ఫ్లాట్ల‌ను విక్ర‌యించాం. కేవ‌లం 140 మంది అదృష్ట‌వంతులు మాత్ర‌మే ఇందులో నివ‌సించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. న‌గ‌ర నిర్మాణ రంగంలో స‌రికొత్త ల్యాండ్‌మార్కుగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. – ప్ర‌శాంత్ రావు, ఎండీ, పౌలోమీ ఎస్టేట్స్

ఇటీవల ప్రాజెక్టు ఆవరణలో కొనుగోలుదారులతో జరిగిన సమావేశంలో సంస్థ.. పౌలోమీ పలాజో బ్రోచర్ ని ఆవిష్కరించింది.

This website uses cookies.