జూబ్లీహిల్స్: మునుగోడు ఉప ఎన్నిక కోసం తరలిస్తున్న రూ. 89.91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో దాడులు నిర్వహించగా.. ఓ కారులో తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని కడారి శ్రీనివాస్ గా గుర్తించారు. ఆయన భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ కు డ్రైవర్ గా తేల్చారు. నగదును జూబ్లీహిల్స్ లొనీ త్రిపుర కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అయితే నగరానికి చెందిన త్రిపుర కన్ స్ట్రక్షన్స్ కంపెనీ ఇంతవరకూ నగరంలో సుమారు ఏడు నివాస సముదాయాల్ని నిర్మించింది. ప్రస్తుతం మూడు నిర్మాణాల్ని చేపడుతోంది. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో.. త్రిపుర కన్ స్ట్రక్షన్స్ బీజేపీకి చెందిన రాజగోపాల్ రెడ్డికి మద్ధతు పలుకుతోందని ఈ తాజా ఉదంతం ద్వారా నిరూపితమైంది. మరి, ఈ సంఘటనపై త్రిపుర సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనను విడుదల చేయలేదు.#HyderabadRealEstate
This website uses cookies.