poulomi avante poulomi avante

లేక్ వ్యూ ఇళ్ల సేల్స్‌పై హైడ్రా ఎఫెక్ట్?

లేక్ వ్యూ ఇళ్ల అడ్వాన్సులను
వెనక్కి తీసుకుంటున్న కస్టమర్లు

ప్రశ్నార్ధకంగా హైదరాబాద్ లోని
25 వేల లేక్ వ్యూ ఇళ్ల‌ భవితవ్యం

గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణ రంగంపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. మహానగరంలో నిన్నటి వరకు లేక్ వ్యూ ఇళ్లకు భారీ డిమాండ్ ఉండగా.. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లేక్ వ్యూ ఇళ్లంటేనే కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజరు వస్తుందోన్న భయంతో లేక్ వ్యూ తో ఉన్న ఇంటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. చెరువులకు సమీపంలో లేక్ వ్యూ తో ఇళ్లు నిర్మిస్తున్న బిల్డర్లు వాటిని ఎలా ఎమ్ముకోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువులను, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా నేలమట్టం చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. హైడ్రా స్పీడ్ తో ఇటు హైదరాబాద్ బిల్డర్లు, అటు హైదరాబాద్ వాసులు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువుల సమీపంలో ఉన్న నివాస ప్రాజెక్టుల్లోని ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. చెరువులకు దగ్గరగా ఉన్న నివాస ప్రాజెక్టుల్లో మంచి లేక్ వ్యూ ఉంటుందని ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిలో ఇప్పుడు కంగారు మొదలైంది. ఏ క్షణంలో హైడ్రా బుల్డోజరు తమ ఇంటి వైపు వస్తుందోనని భయపడుతున్నారు.

నిన్నటి వరకు చెరువులకు సమీపంలోని నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాజెక్టుల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ ఉండేది. మంచి లేక్ వ్యూ తో ఉండే ఫ్లాట్స్, విల్లాలకు ధర కూడా కాస్త ఎక్కువే. కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్ మహానగరంలో స్వచ్చమైన గాలి, వెలుతురు వచ్చే చెరువులకు దగ్గరగా లేక్ వ్యూ ఇల్లు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. అపార్ట్ మెంట్ లేదా విల్లాల నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి మరీ లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేస్తుంటారు ఇంటి కొనుగోలుదారులు.

లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలకు మిగతా ఇళ్లతో పోలిస్తే ధరలు సైతం కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా లేక్ వ్యూ ఇళ్లను హైదరాబాద్ వాసులు కొనుగోలు చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిన్నటి వరకు లేక్ వ్యూ ఇల్లు కోరుకున్న వారంతా ఇప్పుడు లేక్ వ్యూ అంటేనే పెదవి విరుస్తున్నారు. కొత్తగా లేక్ వ్యూ ఇళ్లను కొనడం దేవుడెరుగు.. ఇప్పటికే లేక్ వ్యూ నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ.. ఏ క్షణంలోనైనా హైడ్రా బుల్డోజరు వస్తుందేమోనని భయపడుతున్నారు.

హైడ్రా ప్రభావంతో హైదరాబాద్ లో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఫ్లాట్స్ ను, విల్లాలను అమ్ముకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరు ముందుకు రావడం లేదని బిల్డర్లు వాపోతున్నారు. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెరువులకు దగ్గరగా, చెరువులకు ఎదురుగా నిర్మించే నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లో లేక్ వ్యూ తో ఉన్న ఫ్లాట్స్ కు మిగతా ఫ్లాట్స్ కంటే కాస్త ఎక్కువగా ధర ఉంటుంది. మిగతా ఫేస్ లో ఉండే ఫ్లాట్స్ కంటే లేక్ వ్యూ తో ఉండే ఫ్లాట్స్ కు చదరపు అడుగుకు ప్రాజెక్టును బట్టి 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ధర ఎక్కువగా ఉంటుందని రియల్ రంగ మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు హైడ్రా ప్రభావంతో ఎక్కువ ధర సంగతి పక్కన పెడితే..

అసలు లేక్ వ్యూ తో ఉన్న ఇళ్లు కొనేవారే కరువయ్యారని తెలిసింది. లేక్ వ్యూ తో ఉన్న ఇళ్లను అమ్ముకునేదెలా అని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారన్న చర్చ మార్కెట్లో జోరుగా జరుగుతోంది. హైడ్రా ప్రభావంతో లేక్ వ్యూ ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పడిపోవడంతో.. హైదరాబాద్ లో లేక్ వ్యూ కాన్సెప్ట్ తో చెరువులకు సమీపంలో నిర్మిస్తున్న సుమారు 25 వేల గృహాల సంగతేంటన్న ప్రశ్న బిల్డర్లను ఆందోళన కలిగిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles