వర్షాకాలం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన భవనాలపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) దృష్టి సారించింది. ఈ మేరకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న 188 భవనాలను గుర్తించింది. ఆయా భవనాల్లో ఉన్నవారందరినీ సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. 188 భవనాల్లో పశ్చిమ సబర్బన్ లో 114, తూర్పు సబర్బన్ లో 47, ఐలాండ్ సిటీలో 27 ఉన్నాయని పేర్కొంది. వెంటనే ఆయా భవనాల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేయించడంతో పాటు వాటి రక్షణకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.
ఆ భవనాల లిస్టును వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు బీఎంసీ వెల్లడించింది. అలాగే 30 ఏళ్లు పైబడిన ప్రతి భవనాన్ని స్ట్రక్చరల్ ఆడిట్ చేయించాలని.. ఏమైనా లోపాలుంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది.
This website uses cookies.