Categories: Celebrity Homes

హ్యూమా ఖురేషీ ఆఫీస్ చూస్తే దిల్ ఖుషీ

వర్క్ స్పేస్ కు మేకోవర్ ఇవ్వడం ద్వారా మన ప్రేరణలో కొంత భాగాన్నైనా తిరిగి పొందడానికి కచ్చితమైన మార్గం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ నటి, మోడల్ హ్యూమా ఖురేషీకి తన వర్క్ స్పేస్ పై శ్రద్ధ చాలా ఎక్కువ. తన దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడే ఓ నిర్దిష్టమైన స్థలం నుంచి పనిచేయడానికే ఆమె ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ రూపిన్ సుచిక్ వంటి వారి నుంచి డిజైన్ ప్రేరణతో తన కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.

‘హ్యూమా, నేను వర్క్ స్పేస్ ను అందంగా తీర్చిదిద్దే విషయంలో ఒకరికొకరు సూచనలు చేసుకున్నాం. ఆ సృజనాత్మక ఐడియాలు చాలా కచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. ఆమెకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఏమి కోరుకోకూడదో తనకు బాగా తెలుసు. ఆమెకు ప్రేరణ ఇచ్చేది ఏదో ఉంది. కానీ అది భయపెట్టేది కాదు.. అదే ఆమె అజెండా. ఇది కొంచెం బోహేమియన్ మాదిరిగా.. స్పేస్ అంతా భారీ టెక్చర్లతో, అందమైన ప్రింట్లతో ఉంది. ప్రస్తుత తరుణంలో ఆఫీసు అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అంశాల్లో ఒకటిగా మారింది. హ్యూమా చాలా ఎక్కువగా సూర్యరశ్మి వచ్చే వర్క్ స్పేస్ ను ఎంచుకుంది. అది అటు సౌకర్యవంతంగానూ, సృజనాత్మకంగానూ ఉన్న స్థలం. అంతేకాకుండా గోడలపై ఉన్న కవితాత్మక చిత్రాలు ఆ స్థలాన్ని కళాత్మకం చేశాయి’ అని రూపిన్ తెలిపారు.

బయట నుంచి చూడగానే అది ఆఫీసు అని స్పష్టంగా కనిపించాలని హ్యూమా, ఆమె ఇంటీరియర్ డిజైనర్ కోరుకున్నారు. బయట నుంచి చూసిన వెంటనే లోపల ఎలా ఉంటుందో అనే ఉత్సుకత కలిగేలా చేయాలని భావించారు. హ్యూమా ఇంటీరియర్ డిజైనర్ రూపిన్ కమ్యూనికేషన్ డిజైనర్ కావడంతోపాటు డిజైన్ పై సరైన అవగాహన ఉండటం హ్యూమాకు లాభించింది. క్రేజీ వాల్ ప్రేమ్ ల నుంచి పురాతన షిప్ మినీయేచర్ వరకు ఎన్నో ప్రత్యేకతలతో దానిని డిజైన్ చేశారు. వ్యక్తిగత అవసరాలకు తగినట్టుగా మొత్తం స్పేస్ ను రూపొందించారు. ‘కుర్చీలు, ఫర్నిచర్ పై ఉన్న వివరమైన ప్రింట్లు ఉన్నాయి. ఈ మొత్తం పనంతా ఒకటిన్నర రోజుల్లోనే పూర్తి చేయాలి.. అదే సమయంలో చాలా ప్రభావవంతంగా కనిపించాలి. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. స్పేస్ కు సంబంధించి ఏం చేయాలో అన్నీ చేశారు. రూపిన్ మనసు పెట్టి పని చేయడంతో అదిరిపోయే ఔట్ పుట్ వచ్చింది. క్యూరేటెడ్ ఆర్డ్ లేదా ఫర్నిచర్ యొక్క ప్రతిభాగం హ్యూమా స్టైట్ ను అలరిస్తుంది. అది చాలా సరదాగా కూడా ఉంటుంది.

సొగసైన, స్టైలిష్ ఆఫీసు కోసం ఆరాటపడుతున్న హ్యూమా ఖురేషీ దగ్గర డిజైన్, క్లాసిక్ ఫర్నిచర్, వెచ్చని లైటింగ్ అన్నీ ఒకేచోట ఉన్నాయి. ‘డెస్క్ స్థలంలో ఒక సోఫా, రెండు కుర్చీలు, వర్కింగ్ డెస్క్ ఉంటాయి. మొత్తమంతా కళాత్మకంగా ఉండాలి. తాను పోషించిన అన్ని పాత్రలూ ఇక్కడ ప్రతిబింబించాలన్నది హ్యూమా ఆకాంక్ష. బే విండోతో, ప్రింటెడ్ టైల్స్ తో కలిపి బిర్చ్ ప్లై ఫినిష్ వంటి మెటీరియల్స్ వినియోగించాం. ఇక వర్క్ స్పేస్ లో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఖాళీలు ఉన్నాయి. రిసెప్షన్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రధాన క్యాబిన్, రైటర్ క్యాబిన్ దారితీసే కారిడార్ ఉన్నాయి. ప్రొడక్షన్ ఆఫీసు కావడంతో నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతల కోసం ప్రత్యేక క్యాబిన్ ఉంది. ఒకేసారి మూడు ప్రాజెక్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు’ అని రూపిన్ వివరించారు.

ఆమె వర్క్ స్పేస్ ను సాధారణ డెకో ఐడియాలతో రూపొందించిన తీరులోనే ఆమె ప్రశాంతత కనిపిస్తుంది. హ్యూమాకి ఆమె స్టైల్ ఏదైనా పర్వాలేదు.. కానీ మీరు కచ్చితంగా కొన్ని గొప్ప ఆలోచనలు కనుక్కుంటారు. ‘హ్యూమా తన సృజనాత్మక సామర్థ్యాలను అత్యున్నతంగా ఉపయోగించుకునేందుకు స్పేస్ అవసరం. ఆమె తన చిత్రాలలో పోషించిన పాత్రల మాదిరిగానే కళ, లోతు కలిగి ఉన్న స్పేస్ ను ఎంచుకుంది. అయితే, ఇక్కడ రెండు సవాళ్లున్నాయి. ఒకటి సమయం, రెండోది ఆ టైమ్ స్కేల్ లోనే ప్రాజెక్టును అమలు చేయడం. హ్యూమా డిజైనర్ బృందం కేవలం తొమ్మిది గంటలు మాత్రమే పని చేసింది. ఇది మాస్టర్ మేనేజ్ మెంట్ కు ఓ క్లాసిక్ ఉదాహరణ. ఇక ఈ ప్రక్రియలో రెండో అంకం పూర్తి కావడానికి 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. దీంతో ఒక పని తర్వాత మరో పనికి ఎంత సమయం తీసుకోవాలనేది నిర్ణయం తీసుకునేవాళ్లం. ఆ స్థలంలో దేనినీ అలా ఖాళీగా ఉంచేయకుండా చూడాలనుకున్నాం. అయితే, అక్కడ ఇతర కార్పొరేట్ కార్యాలయాలు కూడా ఉండటంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా పని చేయడం పెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారితో నిరంతరం వాగ్వాదాలు, గొడవలు కూడా జరిగాయి’ అని రూపిన్ వెల్లడించారు. హ్యూమా కార్యాలయం చాలా సాధారణంగా ఉంటుంది. సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉద్దేశించిన స్థలం ఇది. ఒకేసారి మూడు ప్రాజెక్టులను నిర్వహించడానికి అవసరమైనంత స్పేస్ ఉంది. రైటర్ కోసం స్థలంతో పాటు కాన్ఫరెన్స్ రూమ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా, సరైన దిశలో పని చేసే స్పేస్ ఇది.

 

This website uses cookies.