Categories: LATEST UPDATES

ఐకేఎఫ్ హోమ్ ఫైనాన్స్ న‌గ‌రంలో 50వ బ్రాంచీ

దేశంలో అందుబాటు గృహాల్ని ప్రోత్స‌హించే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల్లో ఒక‌టైన ఐకేఎఫ్ హోమ్ ఫైనాన్స్ న‌గ‌రంలో 50వ శాఖ‌ను కొంప‌ల్లిలో ప్రారంభించింది. చిన్న పరిశ్రమలు మరియు రిటైల్ ట్రేడింగ్ యూనిట్‌లకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో అందుబాటు గృహాల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఐకేఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ ఆర్యేంద్ర కుమార్, రాధే శ్యామ్ గార్గ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

This website uses cookies.