poulomi avante poulomi avante

పొలమూ.. పొలమూ.. ప్లాట్లుగా ఎవరు మార్చారు?

  • తెలంగాణలో ‘నాలా’కు తూట్లు
  • ఫీజులు చెల్లించకుండానే నాలా కన్వర్షన్
  • ప్ర‌భుత్వ ఖ‌జానాకు సొమ్మూ రాలేదు
  • వ్య‌వ‌సాయ భూములు ప్లాట్లుగా మారిపోయాయ్
  • ఇలా 3 ఏళ్ల‌లో.. 11.95 ల‌క్ష‌ల ఎక‌రాలు
  • వ్య‌వ‌సాయేత‌ర భూములుగా మ‌ళ్లింపు
  • ఏమిటీ అక్రమం? దీనికి బాధ్యులెవరు?

నాలా చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తెచ్చాక వ్యవసాయేతర రంగాలకు అధికంగా సాగు భూములను మళ్లీస్తున్నారు. సుమారుగా లక్ష పైచిలుకు ఎకరాల భూమిని నాలా కింద ఆయా భూముల యజమానులు కన్వర్షన్ చేసుకున్నారు. అయితే ధరణి ఫోర్టల్ రాక ముందు వచ్చిన తరువాత కూడా కొందరు రెవెన్యూ అధికారులు నాలా చట్టాన్ని పక్కన బెట్టి 11 లక్షల పైచిలుకు ఎకరాల భూమికి నాలా అనుమతులు ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వీటికి కనీసం ఫీజు చెల్లించకుండానే ఆయా యజమానులు వాటిని నాలా కింద మార్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్ని గుర్తించాలని.. వాటి యజమానులకు జరిమానా విధించడంతో పాటు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియ‌జేయాల‌ని ప్ర‌భుత్వం రెవెన్యూ అధికారుల్ని ఆదేశించినట్లు స‌మాచారం.

చ‌ట్టం తెచ్చిన క‌ష్టం!

వాస్తవానికి వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించాలంటే నాలా చట్టం అనుమతులు తప్పనిసరి. దీని ప్రకారం చెరువు, శిఖం, పంట పొలాలకు నష్టం చేసేలా ఉండే భూములను అనుమతించరు. ఆహార భద్రత చట్టానికి కూడా నష్టం చేయని వాటినే నాలా కింద అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అనుమతుల్లో జాప్యం జరుగుతుందన్న కారణంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు తెచ్చింది. దీనివల్ల నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల సమీపంలోని భూములు ప్లాట్లుగా మారుతున్నాయి.

పాత చట్టం ప్రకారం నాలా అనుమతులు పొందాలంటే 2020 నవంబర్‌కు ముందు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇచ్చేవారు. ఆ తరువాత ఆర్డీఓ ఆమోదించి నాలా అనుమతిని జారీ చేసేవారు. ధృవీకరణ ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే వారు. ఈ ప్రక్రియలో నీటి వనరులకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా.. చెరువు లేదా కుంట కట్ట ఎత్తుకు మూడింతలు దూరంలో భూమి ఉందా లేదా వంటి అంశాల్ని పరిశీలించేవారు. పొలాల మధ్యలో ఆ భూమి ఉందా.. కాల్వలకు నష్టం చేసేలా ఉందా అనేది చూసేవారు. అనుమతి పొందకుండా భూమి రూపు మార్చితే చర్యలు తీసుకునేవారు.

సులువుగా అనుమ‌తులు!

2020 నవంబర్ రెండోతేదీ నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్లో సులువుగా నాలా అనుమతులు వస్తున్నాయి. ధరణి పోర్టల్లో సమాచారం ఉండి భూ యజమాని వద్ద పాసు పుస్తకం ఉంటే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సంవత్సరం కాలంలో లక్షకు పైగా ఎకరాలకు నాలా అనుమతులు జారీ అయ్యాయి. అంటే, అనుమతి పొందకుండానే రాష్ట్రంలో 11.95 లక్షల ఎకరాలను వ్యవసాయేతర ప్రయోజనాలకు మళ్లీంచారని ప్రభుత్వం గుర్తించింది.

ఈ తంతు మూడేళ్లుగా కొనసాగుతోందని, ధరణి వచ్చిన తరువాత కూడా రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహారించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అవ‌న్నీ ఇంకా సాగుభూముల ఖాతాలోనే ఉన్న‌ట్లు తేలింది. నివాస ప్రాంతాలకు సమీపంలోని సాగు భూముల రూపు మారితే పెద్ద‌గా న‌ష్టం ఉండ‌దు. కాక‌పోతే, వ్యవసాయ క్షేత్రాల సమీపంలో నాలా అనుమతులు పొందిన వాటితోనే అస‌లు సమస్య అని రైతులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం దృష్టి సారించాల‌ని విజ్ఞప్తి చేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles